Site icon HashtagU Telugu

Indian Killed: తండ్రికి కాల్ చేసిన 3 గంట‌ల త‌ర్వాత.. బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన నవీన్‌

Naveen Ukrain

Naveen Ukrain

ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో పాటు సాధారణ ప్రజలు కూడా మరణిస్తున్నారు. ఇరు దేశాల యుద్ధం ప్రారంభమై మంగ‌ళ‌వారం నాటికి ఆరు రోజులు అవుతోంది. రోజురోజుకు యుద్ధం తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగ‌ళ‌వారం ఉద‌యం ఉక్రెయిన్‌పై ర‌ష్యా చేసిన దాడుల్లో భార‌త్‌కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్‌లో రష్యా మిస్సైల్ దాడిలో కర్ణాటకకు చెందిన మెడికల్ విద్యార్థి నవీన్ శేఖరప్ప మరణించాడు.

భయపడిందే జరిగింది. ఉక్రెయిన్‌, ర‌ష్యా యుద్దానికి భారతీయ విద్యార్ధి బలయ్యాడు. ఖార్కీవ్‌లో క్షిపణి షెల్స్‌ మీద పడడంతో భారతీయ విద్యార్ధి నవీన్ చనిపోయాడు. కర్ణాటక రాష్ట్రంలోని హవేరి హావేరి జిల్లా చెళగేరి గ్రామానికి చెందిన 21 ఏళ్ల నవీన్ ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చేస్తున్నాడు. ఉద‌యం 10:30 గంట‌ల‌కు తండ్రి శేఖర్ జ్ఞాన గౌడ్‌కు కాల్ చేసి తాను క్షేమంగానే ఉన్నాన‌ని న‌వీన్ తెలిపాడు. 3 గంట‌ల త‌ర్వాత అంటే మ‌ధ్యాహ్నం ఒట‌టి త‌ర్వాత త‌ర్వాత భారత ప్రభుత్వ అధికారులు న‌వీన్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి విచారకరమైన వార్తను తెలియజేశారు.

దీంతో మెడిసిన్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్‌ యుద్ధంలో చిక్కుకొని ణాలను కోల్పోవడం అందరిని కలిచివేస్తోంది.క్షిపణి దాడిలో నవీన్ మరణించిన విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ధృవీకరించింది. నవీన్‌ మృతిపై తీవ్ర సంతాపం తెలిపింది. కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని విదేశంగా శాఖా ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. నవీన్‌ కుటుంబంతో టచ్‌లో ఉన్నామని విదేశాంగశాఖ వెల్లడించింది. నవీన్‌ మృతితో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇక ఈ ఘటన తెలియగానే భారీ సంఖ్యలో గ్రామస్థులు నవీన్‌ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. కర్ణాటక సీఎం బస్వరాజ్‌ బొమ్మై కూడా నవీన్‌ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. ఉదయం ఆహారం కోసం సూపర్‌ మార్కెట్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. మిస్సైల్‌ షెల్‌ మీద పడడంతో నవీన్ అక్కడికక్కడే చనిపోయాడు. కాగా ఇంకా 3-4 వేల మంది భారతీయులు ఖర్కీవ్‌లోనే చిక్కుకున్నట్లు సమాచారం. ఈ క్ర‌మంలో ఖార్కీవ్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధులు రష్యా సరిహద్దుల మీదుగా స్వదేశం చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని స‌మాచారం.