పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మతం మార్పించిన కేసులో ముస్లిం యువకుడిని అరెస్ట్ చేశారు. కర్ణాటకలో ఇటీవల ప్రకటించిన మత స్వేచ్ఛ హక్కు చట్టం కింద ఇది మొదటి అరెస్ట్. అక్టోబర్ 5న 19 ఏళ్ల యువతి అదృశ్యం కావడంతో ఆమె తల్లి యశ్వంత్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ తల్లి ఫిర్యాదు మేరకు అక్టోబర్ 6న మిస్సింగ్ కేసు నమోదైంది. దీంతో అక్టోబరు 8న సయ్యద్ మొయిన్‌తో పాటు మహిళను పోలీస్ స్టేషన్‌లో విచారించగా.. తన కుమార్తెను పెళ్లి చేస్తానని చెప్పి మరో మతంలోకి మార్చాడని మహిళ తల్లి అక్టోబర్ 13న మళ్లీ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు చట్టంలోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. సెప్టెంబరు 30న కర్ణాటకలో మతమార్పిడి నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది.
Karnataka Anti-Conversion law : కర్నాటక మతమార్పిడి నిరోధక చట్టం కింద తొలి అరెస్ట్

Arrest Imresizer