Murugha Mutt: 10ఏళ్లుగా మైనర్లపై మురుగ మఠాధిపతి లైంగిక వేధింపులు.. పోలీసుల విచారణలో వెల్లడి!!

లింగాయత్ సంత్నుశివమూర్తి మురుగ శరణరును కర్నాటక పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Lingayat seer Shivamurthy Murugha Sharanaru

Lingayat seer Shivamurthy Murugha Sharanaru

లింగాయత్ సంత్నుశివమూర్తి మురుగ శరణరును కర్నాటక పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మైనర్లను లైంగికంగా వేధించారని శివమూర్తి మురుగ శరణుపై వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చేపట్టిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత దశాబ్ద కాలంగా మైనర్ బాలికలపై మురుగ శరణరు లైంగిక వేధింపులకు పాల్పాడ్డాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…చిత్రదుర్గ మురుగ మఠంలో మైనర్లపై నిందితుడు 10ఏళ్లకు పైగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తమ విచారణలో తేలిందని తెలిపారు. కొంతమంది బాధితులు అబార్షన్లు చేయించుకోవల్చి వచ్చిందన్నారు. మరికొందరు మఠం హాస్టల్ నుంచి బయలుదేరి అదృశ్యమైనట్లు చెప్పారు. నింధితుడు మఠంలో అనాథలను టార్గెట్ చేసి ఈ అక్రుత్యాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్లీజర్ ట్రిప్ కోసం థాయిలాండ్ వెళ్లి అక్కడ అత్యాధుని హంగులతో బాత్ రూమ్ తయారు చేయించుకున్నాడని విచారణలో వెల్లడైంది. అక్కడికి మైనర్లను రప్పించుకుని అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. అబ్బాయిల గ్రూపుతో అమ్మాయిలను తన వద్దకు తీసుకువచ్చేలా ప్లాన్ చేసినట్లు చెప్పారు. నిందితుడు  ప్రస్తుతం చిత్రదుర్గ జిల్లా జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

  Last Updated: 19 Sep 2022, 03:14 PM IST