Sabarimala – 300 Cases : శబరిమలలో భారీ రద్దీకి తగిన విధంగా సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు పడుతున్న ఇబ్బందులపై కేరళ హైకోర్టు రిజిస్ట్రీకి దాదాపు 300కుపైగా ఫిర్యాదులు అందాయి. వీటిని సుమోటోగా స్వీకరించిన కేరళ హైకోర్టు దేవస్థానం బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. మండలం, మకరజ్యోతి కాలంలో వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. ఎరుమెలిలోని హోటళ్లలో ధరల బోర్డులు ఏర్పాటు చేయించాలని నిర్దేశించింది. పార్కింగ్ స్థలాల్లో అధిక డబ్బులు వసూలు చేయకుండా చూడాలని పేర్కొంది. లైసెన్స్లు లేకుండా పార్కింగ్ స్థలాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డర్ ఇచ్చింది. ఈ అంశంపై స్పందించిన కేరళ ప్రభుత్వం.. రద్దీ నిర్వహణలో తలెత్తిన లోపాన్ని భక్తులు ఇబ్బందులుగా చిత్రీకరిస్తున్నారని కోర్టుకు(Sabarimala – 300 Cases) బదులిచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
- ఈ ఏడాది నవంబర్ 17న మండలం – మకరజ్యోతి కాలం ప్రారంభమైంది.
- భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి వెళ్లే రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది.
- దీంతో ఇతర రాష్ట్రాల భక్తులు అయ్యప్ప దర్శనం కాకుండానే పందళం వలియకోయికల్ ధర్మశాస్త్ర ఆలయాన్ని దర్శించుకుని వెనుదిరిగారు.
- వాహనాలను పంబా వరకు అనుమతించకపోవడంతో భక్తులు ఆందోళన తెలిపారు.
- ప్రైవేటు వాహనాలను బోలక్కల్ వరకే అనుమతించిన అధికారులు అక్కడి నుంచి 22 కిలోమీటర్ల దూరంలోని పంబాకు ప్రభుత్వ బస్సుల్లో వెళ్లాలని సూచించడంపై నిరసనలు వెల్లువెత్తాయి.