Miss India World 2022: కర్ణాటక బ్యూటీకి ‘మిస్ ఇండియా’ కిరీటం!

ఫ్యాషన్‌రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఫెమినా మిస్‌ ఇండియా’ కిరీటం ఈ ఏడాది కర్ణాటకకు చెందిన సినీశెట్టి సొంతమైంది.

Published By: HashtagU Telugu Desk
Miiss India

Miiss India

ఫ్యాషన్‌రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఫెమినా మిస్‌ ఇండియా’ కిరీటం ఈ ఏడాది కర్ణాటకకు చెందిన సినీశెట్టి సొంతమైంది. ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో గ్రాండ్‌ ఫైనల్‌ వేడుకగా జరిగింది. అన్ని పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సినీశెట్టి విజేతగా నిలిచి.. అందాల కిరీటాన్ని తన సొంతం చేసుకున్నారు. ఆదివారం ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో కర్ణాటకకు చెందిన ఈ బ్యూటీని విజేతగా ప్రకటించారు. ఈ వేడుకలో రాజస్థాన్‌కు చెందిన రూబల్ షెకావత్ ఫెమినా మిస్ ఇండియా 2022 ఫస్ట్ రన్నరప్‌గా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన షినాతా చౌహాన్ ఫెమినా మిస్ ఇండియా 2022 సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. జ్యూరీ ప్యానెల్‌లో నటులు నేహా ధూపియా, డినో మోరియా, మలైకా అరోరా, డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ షియామాక్ దావర్, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ ఉన్నారు. వర్చువల్ ఆడిషన్స్ ద్వారా దేశం నలుమూలల నుండి ప్రతిభను బయటకు తీయడానికి దేశవ్యాప్తంగా ఈ పోటీలు జరిగాయి.

  Last Updated: 04 Jul 2022, 11:17 AM IST