Site icon HashtagU Telugu

Aircraft Flips Over: రన్ వే పై కుప్పకూలిన శిక్షణ విమానం.. ట్రైనీ పైలెట్ సేఫ్..!

plane

Resizeimagesize (1280 X 720) 11zon

కేరళ తిరువనంతపురంలో బుధవారం ఓ శిక్షణ విమానం కూలిపోయింది. విమానం టేకాఫ్ అవుతుండగా రన్ వే పైనుంచి అదుపు తప్పిన విమానం బోల్తా (Aircraft Flips Over) పడింది. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలెట్ సురక్షితంగా బయటపడ్డాడు. శిక్షణ పొందుతున్న ఓ విద్యార్థి ఈ విమానాన్ని నడిపినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటన జరిగినప్పుడు విమానంలో అతను ఒక్కడే ఉన్నాడని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు. రన్‌వే మూసివేయడం వల్ల మూడు వాణిజ్య విమానాలు ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను కనుగొనడానికి విచారణ ప్రారంభించబడింది. అధికారులు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ)కి నివేదికను సమర్పించనున్నారు.

కేరళ తిరువనంతపురంలో రాజీవ్ గాంధీ అకాడమీ ఫర్ ఏవియేషన్ టెక్నాలజీ వద్ద ట్రైనర్ విమానం కూలిపోయింది. ఎయిర్‌పోర్ట్ రన్‌వే నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. క్రాష్ ల్యాండింగ్ తర్వాత విమానంలో మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Also Read: Transgender: ట్రాన్స్‎జెండర్ జంటకు బిడ్డ.. ఇండియాలో తొలిసారి!

“రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీకి చెందిన శిక్షణా విమానం (CESNA 172R) రన్‌వే 32 నుండి టేకాఫ్ అవుతుండగా ఫిబ్రవరి 8, 2022న 11:36 గంటలకు టాక్సీవేలు B, C మధ్య పశ్చిమానికి తిరిగింది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం పైలట్ ARFF ద్వారా వెంటనే కోలుకున్నారు. సంఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే బృందం, అధికారులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. రన్‌వే కార్యకలాపాలు సురక్షితంగా 12:36కి పునఃప్రారంభించబడ్డాయి.” అని అన్నారు.