10 Died: తమిళనాడులో మిచౌంగ్ బీభత్సం, 10 మంది దుర్మరణం

  • Written By:
  • Updated On - December 5, 2023 / 11:27 AM IST

10 Died: ‘మిచౌంగ్’ తుఫాను నేపథ్యంలో తమిళనాడులోని పలు రహదారులు, సబ్‌వేలు జలమయం అయ్యయి. చెన్నై పూర్తిగా జలమయం కావడంతో దాదాపు 10 మంది దుర్మరణం పాలయ్యారు. పుఝల్ సరస్సు నుంచి నీటిని విడుదల చేయడంతో మంజంబాక్కం నుంచి వడపెరుంబాక్కం రోడ్డుపై ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

“దిండిగల్ జిల్లా, నట్లున్ కు చెందిన పద్మనాబన్ (50) వరద నీటి చిక్కుకొని చనిపోయాడు. వైద్యనాథన్ ఫ్లైఓవర్ సమీపంలోని 70 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి విద్యుదాఘాతంతో చనిపోయాడు. లోన్ స్క్వేర్ రోడ్ మురుగన్ అనే వ్యక్తి చెట్టు కూలిపోవడంతో మరణించాడు. చెన్నైలో ఓ చోట 60 సంవత్సరాల వయస్సు గల ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించింది.

తురైపాక్కంకు చెందిన గణేశన్ (70) రోడ్డుపై నడుస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ధరత్ (53), సెహ్లిమ్ (50) వద్ద కాంపౌండ్ వాల్ కూలిన కారణంగా చనిపోయారు. అస్సాం రాష్ట్రానికి చెందిన మిరాజుల్ ఇస్లాం (19) స్కూల్ క్యాంపస్‌లోని వర్షపు నీటిలో చనిపోయాడు. తమిళనాడులో ఎయిర్ పోర్టులు సైతం జలమయమయ్యాయి.