Karnataka CM Siddaramaiah : సిద్ధరామయ్య ను చంపేసిన మెటా టూల్ ..అసలు ఏంజరిగిందంటే !!

Karnataka CM Siddaramaiah : బి. సరోజా దేవి మరణాన్ని నివాళిగా పేర్కొనాల్సిన దానిని, "Chief Minister Siddaramaiah passed away yesterday..." అనే విధంగా అనువదించడం తీవ్ర విమర్శలకు గురైంది

Published By: HashtagU Telugu Desk
Karnataka Cm Siddaramaiah A

Karnataka Cm Siddaramaiah A

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah ) చనిపోయాడంటూ సోషల్ మీడియా సంస్థ మెటా(Meta ఆటో-ట్రాన్స్‌లేషన్ టూల్ సంచలనం రేపింది. తాజాగా ప్రముఖ దక్షిణ భారత నటి బి. సరోజా దేవి మృతిపట్ల సీఎం సిద్ధరామయ్య తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా కన్నడ భాషలో సంతాపాన్ని తెలియజేశారు. అయితే, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఈ సందేశాన్ని మెటా ఆటోమేటిక్‌గా ఆంగ్లంలోకి అనువదించడంలో లోపం చోటుచేసుకుంది. అనువాదంలో సిద్ధరామయ్యనే మరణించిన వ్యక్తిగా పేర్కొనడం పెద్ద దుమారానికి దారి తీసింది.

అసలు పోస్టులో బి. సరోజా దేవి మరణాన్ని నివాళిగా పేర్కొనాల్సిన దానిని, “Chief Minister Siddaramaiah passed away yesterday…” అనే విధంగా అనువదించడం తీవ్ర విమర్శలకు గురైంది. ఈ తప్పుడు సమాచారం తో పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తం కాగా , చాలామంది ఇది చూసి షాక్ కు గురయ్యారు. ముఖ్యమంత్రిని దివంగతుడిగా చూపించడంపై సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా సంస్థలు, ముఖ్యంగా మెటా వంటి అంతర్జాతీయ సంస్థలు తమ టూల్స్‌పై పూర్తి నిఖార్సైన పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలని ఆయన హెచ్చరించారు.

BJP Fire Brand : ఇక బీజేపీలో ఫైర్ బ్రాండ్ ఆమెనే..రాజాసింగ్ ను మరచిపోవాల్సిందేనా..?

ఈ వ్యవహారంపై సిద్ధరామయ్య మీడియా సలహాదారు కేవీ ప్రభాకర్ జూలై 16న మెటా సంస్థకు అధికారికంగా ఈమెయిల్ రాసి తమ ఆందోళనను తెలియజేశారు. ఆటో-ట్రాన్స్‌లేషన్ వ్యవస్థలో ఇలా తీవ్రమైన లోపాలు ఉండటం కన్నడ భాషకు మాత్రమే కాదు, అధికారిక పరంగా కూడా ప్రమాదకరమని తెలిపారు. రాజకీయ నాయకుల, ప్రభుత్వ అధికారి సందేశాల్లో తప్పులు చెలామణి అయితే అవి ప్రజల్లో తప్పుదారి చూపే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. కనుక మెటా సంస్థ, తమ అనువాద వ్యవస్థను పూర్తిగా నిఖార్సుగా తయారుచేసే వరకూ, కన్నడ భాషకు ఆటో-ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు.

ఈ ఘటన తర్వాత సోషల్ మీడియా వేదికలపై అనువాద టూల్స్ ఖచ్చితతపై పెద్ద చర్చ ప్రారంభమైంది. భాషలకు సంభంధించిన లోతైన భావాలను యాంత్రికంగా సరైనదిగా అనువదించకపోతే, ఈ విధమైన ప్రమాదాలు తప్పవన్నది మరోసారి తేలిపోయింది. ముఖ్యంగా అధికారికంగా పదవిలో ఉన్న వ్యక్తుల విషయంలో మాత్రం, అనువాదాలు మరింత జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. మెటా ఇప్పటి వరకు ఈ అంశంపై స్పందించలేదు కానీ, ఆ సంస్థపై ఒత్తిడి పెరుగుతోంది.

  Last Updated: 18 Jul 2025, 12:24 PM IST