Site icon HashtagU Telugu

Padma Awards: పద్మ అవార్డుల విషయంలో అది మాత్ర‌మే ముఖ్యం – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా

వివిధ వర్గాల ప్రజలు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా పద్మ అవార్డులను ప్రదానం చేసేందుకు యోగ్యత ఒక్కటే కొలమానం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. గతంలో అవార్డు గ్రహీతల ఎంపిక ప్రక్రియను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే సిఫారసు లేకుండా అవార్డు గ్రహీతలను ఎంపిక చేయలేదని అమిత్ షా అన్నారు. ఇప్పుడు ఈ ప్రక్రియ ప్రజాస్వామ్యంగా, పారదర్శకంగా మారిందని…ప‌ద్మ అవార్డుల‌కు మెరిట్ మాత్రమే ముఖ్యం అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేయడంతో ఆన్‌లైన్‌లో నామినేషన్లు స్వీకరిస్తారని అమిత్ షా తెలిపారు. అత్యుత్తమ సేవలందించిన అట్టడుగు స్థాయి వ్యక్తులకు ఇప్పుడు అవార్డులు ఇస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా క‌ర్ణాట‌క‌కు చెందిన 72 ఏళ్ల గిరిజన మహిళా పర్యావరణవేత్త తులసి గౌడ గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆమె స్థానిక వృక్షజాలంపై తనకున్న అపార పరిజ్ఞానంతో వేలాది మొక్కలు నాటడమే కాకుండా వాటిని ఎంతో కాలంగా పెంచి పోషించిందని తెలిపారు. కర్ణాటకలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ పేద మహిళ ఉదంతం కూడా ఇందుకు మంచి ఉదాహరణన‌ని.. ఆమె పాదరక్షలు కూడా ధరించద‌ని…ఈ ఏడాది ఆమెకు పద్మశ్రీ అవార్డు లభించిందని అమిత్ షా తెలిపారు.

Also Read : కోటి రూపాయ‌ల ఆస్తిని రిక్షా పుల్ల‌ర్ కి ఇచ్చేసిన మ‌హిళ‌…!

ప్రభుత్వం నుండి ఎలాంటి గ్రాంట్ తీసుకోకుండా సామాజిక సేవా కార్యక్రమాలను పెద్దఎత్తున స్వర్ణ భారత్ ట్రస్టు చేప‌డుతుంద‌ని ప్రశంసించిన అమిత్ షా…దేశాభివృద్ధికి గ్రామీణాభివృద్ధి కీలకమైనందున ట్రస్ట్ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా పునరావృతం కావాలని అన్నారు. కోస్తా నెల్లూరు జిల్లాలోని నిద్రాణమైన గ్రామం నుండి వచ్చిన వెంక‌య్య నాయుడుకి గ్రామీణ ప్రజల సమస్యల గురించి బాగా తెలుసని… వారి అభ్యున్నతికి తన వంతు కృషి చేశారని అమిత్ షా అన్నారు. బ్యాక్ టు విలేజెస్అ నే మహాత్మా గాంధీ ఆలోచనతో మార్గనిర్దేశం చేయబడిన ఉపరాష్ట్రపతి, ఈ ట్రస్ట్ ద్వారా గ్రామీణ భారతదేశంలోని పేద మరియు అణగారిన వర్గాలకు నిస్వార్థంగా సేవ చేస్తున్నారని అమిత్ షా ట్విట్ట‌ర్ లో కూడా పేర్కోన్నారు.

Also Read : షా చాటు జ‌గ‌న్‌.!