Miraya Vadra : కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ పోటీ చేస్తున్నారు. ప్రచారంలో తమ తల్లికి సహకరించేందుకు కుమార్తె మిరాయా వాద్రా(Miraya Vadra), కుమారుడు రైహాన్ వాద్రా కూడా రంగంలోకి దిగారు. ప్రియాంక వెళ్లిన చోటుకల్లా మిరాయా, రైహాన్ కూడా తోడుగా వెళ్తున్నారు. తమ తల్లి ఎన్నికల ప్రచార శైలిని వారిద్దరు దగ్గరి నుంచి గమనిస్తున్నారు. ఈసందర్భంలో మనం మిరాయా వాద్రా గురించి తెలుసుకుందాం.
Also Read :CJI Sanjiv Khanna : తాతయ్య ఇల్లు మిస్సింగ్.. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎమోషనల్ నేపథ్యం
మిరాయా వాద్రా గురించి..
- ప్రియాంకాగాంధీ కుమారుడు రైహాన్ వాద్రా వయసు 24 ఏళ్లు. కుమార్తె మిరాయా వాద్రా వయసు 22 ఏళ్లు.
- వికీపీడియా పేజీ ప్రకారం.. మిరాయా వాద్రా 2002 సంవత్సరంలో జూన్ 24న జన్మించారు. ఆమె నిక్ నేమ్ ‘పిహు’.
- ఉత్తరాఖండ్‌లోనివెల్హామ్ గర్ల్స్ కాలేజీలో మిరాయా వాద్రా చదువుకున్నారు.
- రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా మిరాయా పాల్గొన్నారు.
- హర్యానా రాష్ట్ర బాస్కెట్ బాల్ గర్ల్స్ టీమ్ తరఫున జాతీయ స్థాయి పోటీల్లో మిరాయా వాద్రా ఆడారు.
- మిరాయా వాద్రా అన్నయ్య రైహాన్ వాద్రాకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ప్రత్యేకించి రోడ్ ఫొటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే ఆయన చాలా ఇష్టపడతారు.
- రైహాన్ చాలా ఆర్ట్ ఎగ్జిబిషన్లలో పాల్గొన్నారు. ఆయన సొంతంగా కూడా రెండు ఆర్ట్ ఎగ్జిబిషన్లను నిర్వహించారు. ‘డార్క్ పర్సెప్షన్’ పేరుతో ఒక ఎగ్జిబిషన్‌ను, ‘గెస్’ పేరుతో మరో ఎగ్జిబిషన్‌ను రైహాన్ ఏర్పాటు చేశారు.
- గత లోక్‌సభ ఎన్నికల్లో మిరాయా, రైహాన్ ఇద్దరు కూడా ఓట్లు వేశారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటువేయాలని ఆసందర్భంగా వారు పిలుపునిచ్చారు. తద్వారా ఎంతోమంది దేశ యువతకు స్ఫూర్తిప్రదాతలుగా నిలిచారు.
- మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి భావి రాజకీయ వారసులుగా వారిని వయనాడ్ ప్రజలు దగ్గరి నుంచి గమనిస్తున్నారు.