AP MLAs: వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీకి నో

ఏపీ సీఎం జగన్.. పార్టీ నేతల విషయంలో ఆది నుంచి కటువుగానే ఉంటున్నారనే వాదన ఉంది.

  • Written By:
  • Publish Date - October 24, 2022 / 11:43 PM IST

ఏపీ సీఎం జగన్.. పార్టీ నేతల విషయంలో ఆది నుంచి కటువుగానే ఉంటున్నారనే వాదన ఉంది. దీంతో అనేక మంది సీనియర్లు పార్టీని వదిలి వెళ్లిపోయారు. ‘ఎవరు ఏం చెప్పినా.. నీకే తెలుసా? ‘ అని ఎదురు ప్రశ్నిస్తారు.. అంటూ.. చాలా మంది నాయకులు వాపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఇక తాజాగా వైసీపీలో ఒకరిద్దరు వచ్చే ఎన్నికల నుంచి తప్పుకొంటారనే ప్రచారం ఉంది. ఇప్పటికే ఇలా తప్పుకొనే వారు మానసికంగా కూడా సిద్ధమ య్యాని… ఈ విషయాన్ని అధినేత జగన్ కు కూడా చెప్పేశారని పార్టీలో గుసగుస వినిపిస్తోంది.
ఇటీవల జగన్ నిర్వహించిన సమావేశానికి వచ్చిన గూడూరు ఎమ్మెల్యే మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్.. ఇదే విషయాన్ని జగన్కు చెప్పేశారట. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. ఆయన స్వయంగా ఈ విషయాన్ని జగన్కు చెప్పారని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. కొన్నాళ్లుగా వరప్రసాద్ను పార్టీ పార్టీని ఆయన పట్టించుకోవడం లేదు. వాస్తవానికి పార్టీలో మం చి పదవి వస్తుందని ఆశించారు. కానీ రాలేదు. దీనికితోడు నియోజకవర్గంలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయనప్రోటీ నుంచి తప్పుకొంటున్నట్టుగా ప్రకటించారు.
అదేవిధంగా.. బాపట్ల ఎమ్మెల్యే,మాజీ డిప్యూటీ స్పీకర్ కూడా.. తాను కూడా..పోటీకి సుముఖంగా లేనని అన్నారట. అలానే.. ఆచంట ఎమ్మెల్యే కమ్.. మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు కూడా.. ఇప్పటికే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని.. తెలిపారని.. ఆయన వర్గం చెబుతోంది. ఇలా.. సుమారు ఏడు నుంచి ఎనిమిది మంది ఈ వరుసలో ఉన్నారని అంటున్నారు. అయితే.. వీరికి ఒక్కొక్కొరికి ఒక్కొక్క కారణం ఉందని అంటున్నారు.
ఎవరు ఏ కారణం చెప్పినా.. పొలిటికల్గా మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడమే వారి అజెండాగా ఉందని అంటున్నారు. అయితే.. జగన్ మాత్రం వీరి విషయలో ఆసక్తిగా స్పందించారట. ”సరే.. అన్నా.. మీరు పోటీ చేయకపోతే తర్వాత.. చూద్దాం.. కానీ.. పార్టీని మాత్రం డెవలప్ చేయండి.. పార్టీ చేస్తున్న మంచి పనులను ..ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి” అని సూచించారట. అంటే.. నాయకులు రిజైన్ చేస్తామని.. చెప్పినా.. కూడా జగన్ మాత్రంవారికి ఇచ్చిన టాస్క్ను మాత్రం పూర్తి చేయాలని స్పష్టం చేయడం.. గమనార్హం. మరి ఇప్పుడు వీరు ఏం చేస్తారో చూడాలి