Site icon HashtagU Telugu

Manickam Tagore: మోదీని మహాత్మా గాంధీతో పోల్చడం ఏంటి.. మండిపడ్డ మాణికం ఠాగూర్

Manickam Tagore Telangana congress

Manickam Tagore Imresizer

Manickam Tagore : మాణికం ఠాగూర్ తెలుసు కదా. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా కొన్ని రోజులు పని చేసిన విషయం తెలిసిందే. ఆయన తాజాగా భారత వైస్ ప్రెసిడెంట్ చేసి వ్యాఖ్యలపై మండిపడ్డారు. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్ కర్.. ప్రధాని మోదీని జాతిపిత మహాత్మా గాంధీతో పోల్చారు. దీనిపై ఆయన అది ఆమోదయోగ్యం కాదని అన్నారు. నేను కాదు.. అసలు ఇలాంటి పోలికలను ప్రధాని మోదీ కూడా సమ్మతించరు. మన భారత సంస్థలన్నీ ఒక్కొక్కటిగా ఇలా కుప్పకూలిపోతాయని నేను ఏనాడూ అనుకోలేదు. నాకు చాలా బాధగా ఉందని మధురైలో మీడియాతో మాట్లాడుతూ మాణికం ఆవేదన వ్యక్తం చేశారు.

వైస్ ప్రెసిడెంట్ జగదీప్ శ్రీమద్ రామచంద్ర జయంతి సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ, ప్రధాని మోదీ ఇద్దరి ప్రవర్తన, వాళ్ల ఆలోచన విధానం, వాళ్లు ప్రజల కోసం సేవ చేసిన తీరు అన్నీ శ్రీమద్ రాజచంద్ర బోధనలను అనుసరించే చేశారు అని చెప్పడం వివాదాస్పదమైంది. మహాత్మా గాంధీని మోదీతో ఎలా పోల్చుతారంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు వైస్ ప్రెసిడెంట్ పై మండిపడుతున్నారు.