Site icon HashtagU Telugu

Mangaluru Blast: చిన్నారుల కార్యక్రమమే టార్గెట్ ..చివరి క్షణంలో మారిన ప్లాన్..!!

Blast

Blast

కర్నాటకలోని మంగళూరులో జరిగిన ఆటో పేలుళ్లకు సంబంధించిన ఘటనలో పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. RSSకు అనుబంధంగా ఉన్న సంస్థలు నిర్వహించన చిన్నారుల కార్యక్రమమే టార్గెట్ గా పేలుడుపై నిఘా పెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొదటి చిన్నారుల కార్యక్రమాలను టార్గెట్ పెట్టుకున్నాడని…చివరి క్షణంలో ప్లాన్ విఫలమైందన్నారు.

ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలోని కేశవ్ స్మృతి సంవర్ధన్ సమితి రాష్ట్ర స్థాయి బాల ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలోనే పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు దర్యాప్తు బృందానికి లీక్ అయ్యింది. నవంబర్ 19న సంఘనికేతన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తమ పిల్లలతోపాటు వెయ్యి మందికిపైగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు ఆర్ఎస్ఎస్ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థిలా తయారై పేలుడుకు ప్లాన్ చేశాడు షరీక్.

ఈ విషయం అంతాకూడా నిందితుడిని స్వాధీనం చేసుకున్న్ మొబైల్ ద్వారా వెల్లడైనట్లు నిఘా వర్గాలు తెలిపాయి. సీఎం బస్వరాజ్ బొమ్మై కార్యక్రమమే నిందితుల ప్రధాన లక్ష్యమని నిఘా వర్గాలు ధృవీకరించాయి.

Exit mobile version