Site icon HashtagU Telugu

Prosthetic Hands : 10 ఏళ్ల నిరీక్ష‌ణ ఫ‌లించిన వేళ‌.. ప్ర‌మాదంలో రెండు చేతులు కోల్పోయిన వ్య‌క్తికి కొత్త చేతులు

New Hands

New Hands

బళ్లారి జిల్లాలోని ఓ రైస్‌ మిల్లులో బాయిలర్‌ ఆపరేటర్ బ‌స‌వ‌న్న అనే వ్యక్తికి 10 ఏళ్ల క్రితం ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు. అయితే 10 ఏళ్ల నిరీక్ష‌ణ త‌రువాత అత‌నికి వైద్యులు శ‌స్త్ర‌చికిత్స చేశారు. కొచ్చిలోని అమృత హాస్పిటల్‌లో 14 గంటల పాటు చికిత్స కొత్త చేతుల‌ను అమ‌ర్చారు. బ‌స‌వ‌న్న‌కు మార్పిడి చేసిన చేతులు కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన 25 ఏళ్ల యువ‌కుడు నెవిస్ సజన్ మాథ్యూకు చెందిన‌వి.ఇత‌ను మ‌ర‌ణించ‌డంతో చేతుల‌ను బ‌స‌వ‌న్న‌కు అమ‌ర్చారు. స‌జ‌న్‌ మాథ్యూ ఫ్రాన్స్‌లో అకౌంటింగ్‌లో మాస్టర్స్ చదువుతుండ‌గా.. ఫ్రాన్స్ నుండి సెలవుల్లో ఇంటికి వ‌చ్చాడు. ఆ స‌మ‌యంలో అతను అనారోగ్యంతో సెప్టెంబర్ 25, 2021న కొచ్చిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌గా అయ్యాడు.దీంతో అత‌ని అవ‌య‌వాల‌ను త‌ల్లిదండ్రులు దానం చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు.

బసవన్న 2011 జులైలో బళ్లారిలోని తన కార్యాలయంలో హై-టెన్షన్ విద్యుత్ వైర్లు త‌గిలి గాయాలుపాలైయ్యాడు. అతని రెండు చేతులు బాగా దెబ్బతిన్నాయి.. ప్రమాదం తరువాత, అతన్ని బళ్లారిలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత బెంగళూరుకు తరలించారు, అక్కడ వైద్యులు అతని రెండు చేతులను మోచేయి క్రింద కత్తిరించవలసి వచ్చింది. చాలా సంవత్సరాలు నిరాశ చెందిన తరువాత అతను చివరకు 2016లో అమృత హాస్పిటల్‌లోని హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్‌లో ఒక అద్భుతం కోసం ప్రార్థించాడు. నెవిస్ సజన్ మాథ్యూ నుండి మార్పిడి కోసం ఒక జత చేతులు తిరిగి పొందిన తరువాత, అమృత ఆసుపత్రిలోని సర్జన్ల బృందం బసవన్నను మారథాన్ శస్త్రచికిత్సకు తరలించారు.

అమృత హాస్పిటల్ సెంటర్ ఫర్ ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ హెడ్, డాక్టర్ మోహిత్ శర్మ మాట్లాడుతూ గ్రహీత ముంజేతుల ఎగువ భాగంలో మార్పిడి జరిగిందని.. ఇది చాలా క్లిష్టమైన శస్త్రచికిత్స అని ఆయ‌న తెలిపారు. ఎందుకంటే ఈ స్థాయిలో అవయవ మార్పిడి, మూడింట ఒక వంతు మాత్రమే జ‌రుగుతుంద‌ని.. చేతి కండరాల సహజ పొడవు గ్రహీతలో ఉన్నాయని తెలిపారు. రెండు ఎముకల కలయిక కూడా సంక్లిష్టంగా ఉంటుందని… ఎముకల ఆకారానికి సరిగ్గా జాయినింగ్ ప్లేట్‌లను వంచవలసి ఉంటుందని తెలిపారు. సెంటర్ ఫర్ ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ చైర్మన్ డాక్టర్ సుబ్రమణ్య అయ్యర్ సర్జన్ల బృందానికి నాయకత్వం వహించారు. రోగి యొక్క శస్త్రచికిత్స అత్యంత విజయవంతమైందని ఆయ‌న తెలిపారు. రోగి ప్ర‌తిరోజు ఫిజియోథెర‌పీ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని డాక్ట‌ర్ సుబ్ర‌మ‌ణ్య అయ్యార్ తెలిపారు.

బ‌స‌వ‌న్న‌కు శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంతం అవ్వ‌డంతో అత‌ని కుటుంబ‌స‌భ్యులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అమృత ఆసుప‌త్రి వైద్యుల‌కు వారు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. ఈ సంద‌ర్భంగా బసవన్న మాట్లాడుతూ.. చిన్నవయస్సులోనే రెండు చేతులూ పోగొట్టుకుని కుంగిపోయానని.. చేతులు లేకుంటే ఏమీ చేయలేక.. భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. కొత్త చేతులు అందుకున్నాక నాకు కొత్త జీవితం వచ్చిందని భావిస్తున్నానని..తాను ఇప్పుడు సాధారణ జీవితాన్ని గడపాలని ఎదురు చూస్తున్నానని బ‌స‌వ‌న్న తెలిపారు. త‌న‌కు రెండవ అవకాశం ఇచ్చినందుకు అమృత హాస్పిటల్ వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.