Night Dress: ఆడవాళ్లు ఇంట్లో ఉన్న సమయంలో చీర కంటే నైటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇప్పుడు నైటీ ఓ కాపురంలో చిచ్చుపెట్టింది. భార్య చీర కాకుండా నైట్ వేసుకుందని ఓ భార్త దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెల్గావి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెల్గావి జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. కేవలం బట్టల విషయంలో తలెత్తిన వివాదంతో ఓ భర్త తన భార్యకు పెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. భార్య చీరకు బదులుగా నైట్ డ్రెస్ ధరించడం నిందితుడికి ఇష్టం లేదు. దీనిపై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
Also Read: KMB : కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఈజీ గా రుణాలు తీసుకోవచ్చు..ఎలాగంటే !!
ఈ ఘటన మంగళవారం రాత్రి ఖానాపూర్ తాలూకాలోని నందగడ్ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడిని 34 ఏళ్ల కృష్ణ పాటిల్‌గా బాధితురాలిని అతని 32 ఏళ్ల భార్య మంజుల పాటిల్‌గా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన రోజు కూడా ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది,. అది కాస్తా హింసాత్మకంగా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన కృష్ణ పాటిల్, మంజులపై కిరోసిన్ పోసి నిప్పుంటించాడు. ఈ దాడిలో మంజుల సుమారు 80 శాతం కాలిపోయారు. ఆమెను మొదట బెల్గావి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేర్పించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గోవాలోని ఆసుపత్రికి తరలించారు. నందగడ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
