Site icon HashtagU Telugu

K Pradeep: మలయాళ నటుడు కొట్టాయం ప్రదీప్ క‌న్నుమూత‌

Flw75ggauamen3h Imresizer

Flw75ggauamen3h Imresizer

ప్రఖ్యాత మలయాళ నటుడు ప్రదీప్ కెఆర్ (కొట్టాయం ప్రదీప్ ) గురువారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రికి తరలించినప్పటికీ, కొద్దిసేపటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. డైలాగ్ డెలివరీలో ప్ర‌త్యేక ముద్ర వేసుకున్న ప్రదీప్, కొట్టాయం జిల్లాకు చెందినవాడు, గత కొన్ని సంవత్సరాలుగా తన హాస్య పాత్రలతో మలయాళ చిత్రాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్నాడు.

ప్ర‌దీప్ 60 చిత్రాలలో ముఖ్యమైన పాత్రలను పోషించాడు. గౌతమ్ మీనన్ న‌టించిన ఎవర్‌గ్రీన్ తమిళ బ్లాక్‌బస్టర్ “విన్నైతాండి వరువాయా”, ప్రదీప్ తన నటనా జీవితంలో ఒక పురోగతిని అందించింది. తరువాత, అతను “కట్టప్పనయిలే హృతిక్ రోషన్”, “ఆడు ఒరు భీకర జీవి”, “కున్హిరామాయణం”, “లైఫ్ ఆఫ్ జోసుట్టి” వంటి కొన్ని చిత్రాల ద్వారా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.మోహన్‌లాల్ నటించిన “ఆరట్టు”లో ఒక పాత్ర పోషించినట్లు సమాచారం. ప్రదీప్ మృతి పట్ల మంత్రులు, ప్రజాప్రతినిధులు, నటీనటులు సహా వివిధ వర్గాల ప్రజలు సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సంతాప సందేశంలో, తనదైన శైలిలో చిన్న పాత్రలను కూడా గుర్తుండిపోయేలా చేసిన విలక్షణ నటుడు ప్రదీప్ అని అన్నారు. సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమన్రన్ సహా పలువురు నటీనటులు సోషల్ మీడియాలో నివాళులర్పించారు.