కేరళలో విషాదం చోటుచేసుకుంది. మలప్పురం జిల్లాలోని తూవల్ తీరం టూరిస్ట్ స్పాట్ వద్ద పురపుజా నదిలో ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో టూరిస్ట్ బోట్ బోల్తా (Boat Tragedy Kerala) పడింది. ఈ దుర్ఘటనలో 21 మంది మరణించారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ వివరాలను రాష్ట్ర మంత్రి వి అబ్దురహిమాన్ ధృవీకరించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పోలీసులు, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్, మత్స్యకారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయానికి బోటు (Boat Tragedy Kerala) నుంచి దాదాపు 10 మందిని రక్షించి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ALSO READ : Jelly Fish: అద్భుతమైన వీడియో.. బోటు చుట్టూ చుక్కల్లా జెల్లీ ఫిష్‌లు!
బోటులో 40 మందికిపైగా ప్రయాణించారని గుర్తించామని .. ఈ లెక్కన మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. బోటు కెపాసిటీకి మించిన సంఖ్యలో ప్రయాణికులతో జర్నీ చేయడం వల్లే బ్యాలెన్స్ తప్పి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. బోటులో తగినన్ని ఎమర్జెన్సీ రెస్క్యూ పరికరాలు కూడా లేవన్నారు. సముద్ర తీరానికి 300 మీటర్ల దూరంలో ఉండగా .. బోటు బ్యాలెన్స్ కోల్పోయి ఒకవైపుకు ఒరిగిపోయి నదిలో మునిగిందని వివరించారు. బోటులోని ప్రయాణికులంతా మలప్పురం జిల్లాలోని పరప్పనంగడి, తానూర్ ప్రాంతాలకు చెందిన వారని చెప్పారు. నిబంధనల ప్రకారం రోజూ సాయంత్రం 5 గంటల తర్వాత బోట్లు నడపడానికి వీల్లేదని.. ఈ నిబంధనను పట్టించుకోకుండా జర్నీ చేయడం అంటే రిస్క్ తీసుకోవడమే అవుతుందని పోలీసులు తెలిపారు.