Loneliness & Silence: ఒంటరితనమే లోకం.. నిశ్శబ్దమే బంధువుగా వృద్ధుల టౌన్

మన దేశంలో జనాభా పెరుగుతూ పోతోంది. చైనాను కూడా ఇండియా దాటేసే రోజులు ఎంతో దూరంలో లేవు. ఈ టైంలోనూ కేరళలోని పతనంతిట్టా జిల్లా నడిబొడ్డున ఉన్న కుంబనాడ్..

Loneliness & Silence : మన దేశంలో జనాభా పెరుగుతూ పోతోంది. చైనాను కూడా ఇండియా దాటేసే రోజులు ఎంతో దూరంలో లేవు. ఈ టైంలోనూ కేరళలోని పతనంతిట్టా జిల్లా నడిబొడ్డున ఉన్న కుంబనాడ్ పట్టణంలో డిఫరెంట్ సిచ్యుయేషన్ ఉంది. ఇక్కడ జనాభా తగ్గుతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. కుంబనాడ్ లో ఉన్న 11,118 జనాభాలో 15% మంది మొత్తం ఫ్యామిలీతో పాటు విదేశాలకు వలస వెళ్లిపోయారు. అలా వెళ్లిపోయిన వారి ఇళ్లకు తాళాలు వేయబడి ఉన్నాయి. లోకల్ గా 20 పాఠశాలలు ఉన్నాయి. కానీ వాటిలో చాలా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. కానీ కుంబనాడ్ పట్టణంలోని మూడు వృద్ధాశ్రమాల్లో ఫుల్ గా వృధులు ఉన్నారు. ఈ టౌన్ లో రెండు డజన్లకు పైగా బ్యాంకులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసిస్తున్న పట్టణ ప్రజల నుండి పేమెంట్స్ పొందేందుకు ఈ బ్యాంక్స్ పోటీ పడుతున్నాయి.

అన్నీ ఉన్నా.. ఒంటరితనం (Loneliness)..

కుంబనాడ్ లోని తన రెండంతస్తుల ఎర్రటి టైల్డ్ హోమ్‌కు పొడవైన మెటల్ సెక్యూరిటీ గేట్‌ల వెనుక అన్నమ్మ జాకబ్ అనే 74 వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తోంది. ఆమె భర్త గవర్నమెంట్ చమురు కంపెనీలో మెకానికల్ ఇంజనీర్ గా పనిచేసి 1980ల ప్రారంభంలో మరణించారు. ఆమె 50 ఏళ్ల కుమారుడు గత రెండు దశాబ్దాల నుంచి అబుదాబిలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నారు. ఆమె ఒక కుమార్తె కొన్ని మైళ్ల దూరంలో నివసిస్తోంది. కానీ ఆమె భర్త మూడు దశాబ్దాలుగా దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

ఐదు అంతస్తుల వృద్ధాశ్రమానికి క్యూ..

కుంబనాడ్ పట్టణంలో బహిరంగ ప్రదేశాలు, విశాలమైన తలుపులు , హాలులతో కూడిన వృద్ధాశ్రమాలు ఉన్నాయి. అలెగ్జాండర్ మార్తోమా మెమోరియల్ వృద్ధాప్య కేంద్రంలో 150 పడకల ఆసుపత్రి కూడా ఉంది. ఇది ఐదు అంతస్తుల భవనంలో ఉంది. 85 నుంచి 101 సంవత్సరాల మధ్య వయస్సు గల 100 కంటే ఎక్కువ మంది స్థానికులను ఈ ఆశ్రమం చూసుకుంటుంది. ఈ ఆశ్రమంలో స్త్రీ, పురుషులకు ప్రత్యేక భవనాలు ఉన్నాయి.దీని వెయిటింగ్ లిస్ట్ క్రమంగా పెరుగుతోంది.ఆ వృద్ధుల సంరక్షణ కోసం పిల్లలు ప్రతి నెలా 50,000 రూపాయలు పంపిస్తు న్నారు. కొన్నిసార్లు పిల్లలు వచ్చి ఆ వృద్ధులతో ఒకటి, రెండు రోజులు ఉండి వెళ్ళిపోతారు.

దొంగతనాలు తక్కువ.. ఆర్థిక మోసాలు ఎక్కువ

వృద్ధులు మరియు మూతపడిన ఇళ్లతో కూడిన కుంబనాడ్ పట్టణంలో నేరాలు చాలా తక్కువ. ఇళ్లలో పెద్దగా డబ్బు, విలువైన వస్తువులు ఉంచకపోవడం వల్ల దొంగతనాలు జరగడం చాలా అరుదని పోలీసులు తెలిపారు.  ఇక్కడ మోసం గురించి మాత్రమే ఫిర్యాదులు వస్తాయని చెప్పారు. ఉదాహరణకు సంవత్సరం క్రితం.. ఒక వృద్ధురాలి బంధువు ఆమె సంతకాన్ని నకిలీ చేసి దాదాపు 10 మిలియన్ రూపాయలను దొంగిలించాడు.

ఇక మరో ఘటన విషయానికి వస్తే.. గత ఏడాది పట్టణంలో బ్రాంచీ ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ ఫైనాన్షియల్ సంస్థకు చెందిన నలుగురు ప్రమోటర్లను పోలీసులు అరెస్టు చేశారు.వాళ్ళు క్యాష్ డిపాజిట్లపై బాగా వడ్డీరేట్లు వాగ్దానం చేశారు. అయితే పోంజీ స్కీమ్‌లో డిఫాల్ట్ కావడం ప్రారంభిం చారు. దీంతో దాదాపు 500 మంది స్థానిక డిపాజిటర్లు పోలీసులను ఆశ్రయించారు. వీరిలో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు.

Also Read:  Miracle in the Sky: ఈ రోజు రాత్రికి ఆకాశంలో అద్భుతం..