Lip Lock Controversy : కాలేజీ విద్యార్థుల “లిప్‌లాక్” వీడియో దుమారం.. 8 మంది అరెస్ట్

మితిమీరిన స్వేచ్ఛతో కొందరు యువత పెడదోవ పడుతున్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. త

  • Written By:
  • Publish Date - July 23, 2022 / 02:30 PM IST

మితిమీరిన స్వేచ్ఛతో కొందరు యువత పెడదోవ పడుతున్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం కూడా ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. తాజాగా కర్ణాటకలోని దక్షిణ కోస్తా జిల్లా మంగళూరు పట్టణంలో చోటుచేసుకున్న ఒక ఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది. ఓ నివాసంలో ప్ర‌ముఖ కళాశాల‌కు చెందిన ఇద్ద‌రు విద్యార్థులు కాలేజీ యూనిఫామ్ లోనే… మిగితా పిల్ల‌ల ముందు లిప్ లాక్ లో మునిగిపోయారు. అక్కడే ఉన్న ఓ కుర్రాడు దీనిని రికార్డ్ చేసి వారం క్రితం వాట్సాప్‌లో వీడియో పెట్టాడు.ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ ఇద్దరు విద్యార్థుల లిప్ లాక్ వ్యవహారం కళాశాల యాజమాన్యం దృష్టికి కూడా వెళ్లింది. దీంతో వారిద్ద‌రినీ కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. వీడియో తీసిన మ‌రో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోలో.. ఒక అమ్మాయి తన కాలేజీ స్నేహితుడి ఒడిలో పడుకొని ఉన్న దృశ్యం కూడా ఉంది. అబ్బాయిలలో ఒకరు తదుపరి జంటను ఈ లిప్ లాక్ కోసం పిల‌వ‌డం వినిపిస్తోంది. మంగళూరులోని ఓ అపార్ట్ మెంటులో విద్యార్థులు గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సందర్భంగా ‘ట్రూత్‌ ఆర్‌ డేర్‌’ (Truth or Dare) పోటీలో భాగంగా లిప్‌లాక్‌ ఛాలెంజ్‌ (Lip-Lock Challenge) నిర్వహించారు. ఆరు నెలల క్రితం ఇదంతా జరిగిందని  మంగళూరు పోలీస్ కమిషనర్ ఎన్. శ‌శికుమార్ వెల్లడించారు. అక్కడే ఉన్న ఓ కుర్రాడు వారం క్రితం వాట్సాప్‌లో వీడియో పెట్టాడ‌ని, ఈ విషయం ఆలస్యంగా పాఠశాల యాజమాన్యం దృష్టికి వచ్చిందన్నారు. విద్యార్థులు డ్రగ్స్ సేవించి లిప్ లాక్ పోటీలో పాల్గొన్నారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు పాల్పడిన 8మంది విద్యార్థులపై కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు.లిప్ లాక్ వీడియోను చూపించి ఆ బృందంలోని ఇద్దరు విద్యార్థినులపై తోటి విద్యార్థులు అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఎనిమిది మంది విద్యార్థులపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీ, ఐటీ యాక్టులోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు అనంతరం వారిని జువనైల్‌ జస్టిస్‌ కోర్టులో ప్రవేశపెట్టినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ శశికుమార్‌ వెల్లడించారు.చక్కగా కాలేజీకి వెళ్లి బుద్దిగా చదువుకోవాల్సి పిల్లలు.. ఇలా పెడదోవ పట్టడం షాక్ కి గురి చేసింది.