Site icon HashtagU Telugu

Lip-lock challenge: ‘కిస్సింగ్’ ఇష్యూలో 8 మంది విద్యార్థులపై కేసు నమోదు

Lip Lock

Lip Lock

మంగళూరు నగరంలోని ఓ ప్రైవేట్‌ నివాసంలో కిస్సింగ్‌ ఛాలెంజ్‌ నిర్వహించిన ఎనిమిది మంది విద్యార్థులపై కర్ణాటక పోలీసులు పోక్సో చట్టం (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఓ ప్రముఖ కాలేజీకి చెందిన మైనర్ విద్యార్థులు ఓ ప్రైవేట్ నివాసంలో ఇతరుల సమక్షంలో కిస్సింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థులు రెండు నెలల పాటు అద్దెకు ఫ్లాట్‌ను తీసుకున్నారని, లిప్ లాక్ ఛాలెంజ్ కోసం క్లాస్ మేట్స్ అయిన అమ్మాయిలను తీసుకెళ్లారని, అందులో వారు లిప్‌లాక్‌ వీడియోలు చేశారని పోలీసుల విచారణలో తేలింది. పబ్లిక్ డొమైన్‌లో వచ్చిన ఈ వీడియో రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులను దిగ్భ్రాంతికి గురిచేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేసి కేసులు నమోదు చేశారు.

Exit mobile version