Site icon HashtagU Telugu

Left Vs Rahul Gandhi : లెఫ్ట్ వర్సెస్ రాహుల్ .. వయనాడ్‌లో వెరైటీ పాలిటిక్స్!

Left Vs Rahul Gandhi

Left Vs Rahul Gandhi

Left Vs Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఓ వైపు ఇండియా కూటమిలో వామపక్షాలతో కలిసి నడుస్తున్న రాహుల్.. మరోవైపు వయనాడ్‌లో వామపక్ష పార్టీలను ఢీ కొంటున్నారు. ఈ భిన్నమైన రాజకీయ పరిస్థితిపై అంతటా చర్చ నడుస్తోంది. వయనాడ్‌ నుంచి రాహుల్ పోటీ చేస్తుండటంపై వామపక్ష పార్టీల అగ్రనేతలు ఏమంటున్నారో ఓసారి చూద్దాం.

We’re now on WhatsApp. Click to Join

వయనాడ్ స్థానం విశేషాలు

Also Read : Rs 5 Lakh Per Newborn : ఒక శిశువుకు రూ.5 లక్షల రేటు.. పిల్లలు అమ్మే గ్యాంగ్‌పై సీబీఐ దర్యాప్తు

బీజేపీని వదిలేసి వామపక్షాలనే టార్గెట్ చేశారు : డి.రాజా

కూటమిలోని మిత్రపక్షం అభ్యర్థిపై రాహుల్ గాంధీ పోటీచేయడం సరికాదని సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా భర్త, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏకమై పోరాడుతున్న ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఒంటెత్తు పోకడలను పాటించడం ఆందోళనకరమన్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీని బలంగా ఢీకొనాలని భావిస్తే హిందీ బెల్ట్‌లోని ఏదైనా లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి ఉండాల్సిందన్నారు. నేరుగా బీజేపీతో రాహుల్ ఎందుకు తలపడటం లేదని నిలదీశారు.

సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్ ఏమన్నారంటే..

‘‘బీజేపీని ఎదుర్కోవాలనేదే ఇండియా కూటమి లక్ష్యమైనప్పుడు.. వయనాడ్‌లో కూడా అదే జరగాలి. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ రెండు కూడా అభ్యర్థులను నిలబెట్టాయి’’ అని  సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ కాకుండా మరేదైనా సీటు నుంచి పోటీ చేసి ఉండాల్సిందని సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అభిప్రాయపడ్డారు.

Also Read :Manjummel Boys Review : ‘మంజుమ్మల్ బాయ్స్’ రివ్యూ.. కమల్ హాసన్ లవ్ సాంగ్ వెనుక ఇంత కథ ఉందా..!