పునీత్ రియల్ హీరో.. తాను చనిపోతూ నలుగురి జీవితాల్లో వెలుగులు!

పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు తో మరణించిన విషయం తెలిసిందే. కేవలం 46 ఏళ్ల వయసు లోనే పునీత్ తన కుటుంబాన్ని, కోట్ల మంది అభిమానులను వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

  • Written By:
  • Publish Date - November 2, 2021 / 05:56 PM IST

పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు తో మరణించిన విషయం తెలిసిందే. కేవలం 46 ఏళ్ల వయసు లోనే పునీత్ తన కుటుంబాన్ని, కోట్ల మంది అభిమానులను వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగబోయింది. పునీత్ మరణం కన్నడ ఇండస్ట్రీ ని కుదిపివేసింది. పునీత్ ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు అంతకన్నా గొప్ప వ్యక్తి కూడా. ఆయన దాతృత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. చనిపోయిన తర్వాత కూడా పునీత్ రాజ్ కుమార్ నలుగురు అభిమానులలో బతికే ఉన్నారు. ఆయన కళ్ళు ఇంకా ప్రపంచాన్ని చూస్తూనే ఉన్నాయి.

ఈ విషయాన్ని నారాయణ నేత్రాలయ ఛైర్మన్, ఎండీ భుజంగ్ శెట్టి వెల్లడించారు. సాధారణంగా ఒక వ్యక్తి దానం చేసిన కళ్లతో ఇద్దరికి మాత్రమే చూపు దక్కుతుందని… అయితే పునీత్ కళ్లతో నలుగురికి చూపును ప్రసాదించామని చెప్పారు. పునీత్ కళ్లలోని కార్నియాలోని సుపీరియర్, డీపర్ లేయర్స్ ని వేరు చేయడం ద్వారా… వాటిని నలుగురికి అమర్చగలిగామని తెలిపారు. ఒక్కో కంటిని ఇద్దరికి చూపును తెప్పించేందుకు వినియోగించామని చెప్పారు. సూపర్ఫీషియల్ కార్నియల్ వ్యాధి ఉన్నవారికి సుపీరియర్ లేయర్ మార్పిడి చేశామని.. డీప్ కార్నియల్ లేయర్ వ్యాధి / ఎండోథెలియల్ వ్యాధి ఉన్నవారికి డీపర్ లేయర్ ట్రాన్స్ ప్లాంట్ చేశామని తెలిపారు. పునీత్ చనిపోతూ కూడా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. పునీత్ రాజ్ కుమార్ రీల్ హీరో కాదు.. రియల్ హీరో అని అంటున్నారు ఫ్యాన్స్.

పునీత్ ఈ సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారు. చివరికి తన కళ్లు కూడా దానం చేశారు. ఆయన చదివించిన 1800 పిల్లల బాధ్యత ఇకపై నేను చూసుకుంటాను. ఒక స్నేహితుడిగా పునీత్‌ సేవా కార్యక్రమాలకు నా వంతు సాయాన్ని అందిస్తానని మాటిస్తున్నాను అని విశాల్‌ పేర్కొన్నారు.