700 Crore Loan Fraud : ‘కువైట్ గల్ఫ్ బ్యాంక్’ ప్రవాస భారతీయులపై సంచలన ఆరోపణలు చేసింది. కువైట్‌లో వివిధ జాబ్స్ చేస్తూ తమ బ్యాంకు నుంచి కోట్లాది రూపాయల లోన్స్ తీసుకొని దాదాపు 1,425 మంది భారతీయులు బిచాణా ఎత్తేశారని కువైట్ గల్ఫ్ బ్యాంకు ఆరోపించింది. లోన్స్ తీసుకున్న ప్రవాస భారతీయులు కెనడా, బ్రిటన్ వంటి పలు ఐరోపాదేశాలకు వెళ్లిపోయారని పేర్కొంది. తమ బ్యాంకును మోసం చేసిన వారిలో ఎక్కువ మంది భారత్‌లోని కేరళ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారని బ్యాంకు అధికార వర్గాలు వెల్లడించాయి. వీరిలో ఎక్కువ మంది కువైట్ ఆస్పత్రుల్లో నర్సు పనిచేసే వారే ఉన్నారని పేర్కొన్నాయి.
Also Read :110 Murders : కొడుకుపై ‘చేతబడి’ అనుమానం.. 110 మందిని చంపించిన గ్యాంగ్ లీడర్
కువైట్‌లో ఉపాధి కోసం వచ్చిన 1,425 మంది ప్రవాస భారతీయ ఉద్యోగులు(700 Crore Loan Fraud) తమ బ్యాంకు నుంచి లోన్స్ తీసుకొని.. చెల్లించకుండా మోసం చేసిన మొత్తం విలువ దాదాపు రూ. 700 కోట్లు దాకా ఉంటుందని ‘కువైట్ గల్ఫ్ బ్యాంక్’ ఆఫీసర్లు తెలిపారు. తొలుత సదరు ప్రవాస భారతీయులు తమ బ్యాంకు నుంచి చిన్న లోన్స్ తీసుకున్నారని.. వాటిని సకాలంలో కట్టడంతో పెద్ద మొత్తంలో లోన్స్ మంజూరు చేశామన్నారు. బ్యాంకును చీట్ చేసిన 1,425 మందిలో దాదాపు 800 మంది కువైట్ ఆరోగ్యశాఖలో నర్సులుగా పనిచేసే వారని చెప్పారు.
Also Read :R Krishnaiah : ఆర్ కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ
ఇక ఈ వ్యవహారం కేరళ దాకా చేరింది. ‘కువైట్ గల్ఫ్ బ్యాంక్’కు చెందిన అధికారులు స్వయంగా కేరళకు వచ్చారు. రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారులను వారు కలిసి ఫిర్యాదు ఇచ్చారు. దీని ఆధారంగా కేరళ రాష్ట్రంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 10 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసి కేసులను దర్యాప్తు చేస్తున్నారు.