రెండు రోజుల క్రితం గల్ఫ్ దేశం కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం (Kuwait Fire Accident) జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్మికులు నివసిస్తున్న భవనంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో చాలామంది సజీవదహనం అయ్యారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు భారత్‌కు చెందిన వారే కావడం విషాదకరం. ఇక కొద్దీ సేపటి క్రితం 45 మంది భారతీయుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
మృతదేహాలను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో సహా వారి స్వస్థలాలకు తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. అనంతరం ఇతర రాష్ట్రాల బాధితుల మృతదేహాలతో విమానం ఢిల్లీకి బయలుదేరుతుంది. ఇక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి, రాష్ట్ర మంత్రులు నివాళ్లు (tribute to Kerala CM) అర్పించారు. మృతదేహాలను బంధువులకు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. బాధితుల్లో కేరళకు చెందిన 23 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, ఏపీకి చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఇద్దరు, బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హర్యానాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.
Read Also : Game Changer : శైలేష్ కొలను దర్శకత్వంలో గేమ్ ఛేంజర్.. వైజాగ్ షెడ్యూల్ పిక్ వైరల్..
