Site icon HashtagU Telugu

Tamilnadu: పొంగిపొర్లుతున్న కుట్రాలం జలపాతం, క్యూ కడుతున్న ప్రకృతి ప్రేమికులు

Kutralam

Kutralam

Tamilnadu: వారాంతాల్లోనూ, సెలవురోజుల్లోనూ జలపాతాలున్న ప్రదేశాలను సందర్శించడానికి పర్యాటకులు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. జలపాతాలతో పాటు ఆధ్యాత్మికత కూడా కలగలిసిన ప్రదేశం ఉంటే అక్కడ పర్యాటకుల సందడి ఏ మేరకు ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలా ఆధ్యాత్మికాన్ని, ప్రకృతిసిద్ధ జలపాతాలను తనలో ఇముడ్చుకున్న అద్భుతమైన ప్రదేశమే కుట్రాలం. తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ పట్టణమైన తిరునల్వేలికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఈ కుట్రాలం ప్రాంతం కొలువై ఉంది. ఏడాది పొడువునా ఈ కుట్రాలాన్ని పర్యాటకులు సందర్శిస్తూనే ఉండడం విశేషం.

కుట్రాలం పేరు చెప్పగానే జలపాతాల హోరుతో పాటు అక్కడ వెలసిన కుట్రాల నాదర్ స్వామి ఆలయం అందరికీ గుర్తుకు వస్తుంది. నటరాజు అవతారం కూడా అయిన ఆ పరమేశ్వరుడు కుర్తాల నాదర్‌గా ఇక్కడ వెలిశారని పురాణాలు పేర్కొంటున్నాయి.  ఉరకలెత్తిన కుట్రాలం జలపాతం తమిళనాడులో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి.

ఎత్తైన కొండలపై జారిపడుతున్న నీటి అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. తెనాకాశి జిల్లాలో ఉన్న కుట్రాలం జలపాతం పొంగిపొర్లుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా జారువారుతోంది. కాగా ఔషధ గుణాలు కలిగిన జలపాతంగా కుట్రాలం పేరొందింది. అందుకే అక్కడ స్నానమాచరించేందుకు సందర్శకులు భారీగా వెళ్తుంటారు. తమిళనాడులో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. దీంతో పర్యాటకలు క్యూ కడుతున్నారు.