Site icon HashtagU Telugu

Rajagopal Reddy: ఔను.. అమిత్ షాను కలిశాను!

Komatireddy Amitshah

Komatireddy Amitshah

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన విషయాన్ని స్పష్టం చేశాడు. అయితే బీజేపీలో చేరాల్సిందిగా అమిత్ షా తనను ఆహ్వానించారనే ప్రశ్నకు మాత్రం ఆయన అంగీకరించలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌), టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించే రాజకీయ పార్టీలో చేరతానన్న తన ప్రకటనకు తాను కట్టుబడి ఉంటానని అన్నాడు. పార్టీలో చేరిన తర్వాత టీఆర్‌ఎస్‌ను ఓడించాలనే ఏకైక ఎజెండాతో పని చేస్తానని చెప్పారు.

రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. పార్టీ మారడంపై తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని ఎమ్మెల్యే ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మునుగోడులోని చండూర్‌లో రాజ్‌గోపాల్ తన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. అయితే నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.