Site icon HashtagU Telugu

Safest City : సేఫెస్ట్ సిటీల్లో హైదరాబాద్‌కు మూడో ర్యాంకు.. ఫస్ట్ ర్యాంక్ ఏ నగరానికి ?

Safest City

Safest City

Safest City : మన దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరం ఏదో తెలుసా ? కోల్‌కతా!! ఎందుకు .. అంటే.. దానికి కూడా ఆన్సర్ ఉంది. ఈ ఆన్సర్ చెప్పింది ఎవరో కాదు.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB). మహానగరాలలో ప్రతి లక్ష జనాభాకు సగటున అతి తక్కువ నేరాలు నమోదవుతున్న గణాంకాలను NCRB నమోదు చేసింది. ఈ లెక్కన తక్కువ నేరాలు నమోదవుతున్న నగరంగా నిలిచినందున కోల్‌కతాను సురక్షితమైన నగరంగా ప్రకటించింది. వరుసగా మూడో ఏడాది కూడా మన దేశంలో సురక్షితమైన నగరంగా కోల్‌కతా నిలవడం విశేషం. 2022 సంవత్సరంలో కోల్‌కతాలో ప్రతి లక్ష మందికి సగటున 86 కాగ్నిజబుల్ నేరాల కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీని తర్వాతి స్థానంలో పూణే నిలిచింది. ఇక్కడ 2022 సంవత్సరంలో ప్రతి లక్ష జనాభాకు సగటున 280 కాగ్నిజబుల్ నేరాల కేసులు నమోదవగా.. మన  హైదరాబాద్‌లో సగటున 299 కాగ్నిజబుల్ నేరాల కేసులు నమోదయ్యాయి. అంటే.. దేశంలోని సేఫెస్ట్ సిటీలలో మన హైదరాబాద్ ర్యాంకు మూడు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: INDIA : నో చెప్పిన ‘ఆ నలుగురు’.. ‘ఇండియా’ మీటింగ్ వాయిదా