Site icon HashtagU Telugu

Khushbu Sundar: చెన్నై విమానాశ్రయంలో ప్రముఖ నటి ఖుష్బూకు చేదు అనుభవం

KUSHBU

Resizeimagesize (1280 X 720) 11zon

ఎయిరిండియాపై ప్రముఖ నటి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బూ (Khushbu) విమర్శలు కురిపించారు. చెన్నై విమానాశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. కాలి గాయంతో బాధపడుతున్న తాను ఎయిర్ ఇండియా తీరుతో చెన్నై విమానాశ్రయంలో వీల్‌చైర్ కోసం అరగంటపాటు వేచి చూడాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎయిరిండియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా పేరును ట్యాగ్ చేస్తూ, “మోకాలి గాయంతో ఉన్న ప్రయాణికుడిని తీసుకెళ్లడానికి మీకు ప్రాథమిక వీల్ చైర్ కూడా లేదా?” అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

నేను మరో ఎయిర్‌లైన్ నుండి వీల్‌చైర్‌ను తీసుకునే వరకు చెన్నై విమానాశ్రయంలో అరగంటపాటు గాయంతో వేచి ఉన్నానన్నారు. లిగ్మెంట్ గాయంతో బాధపడుతూ కట్టుతో ఉన్న తనకు చెన్నై విమానాశ్రయంలో చక్రాల కుర్చీ కోసం కట్టుతో అరగంటపాటు వేచి చూడాల్సి వచ్చిందని అన్నారు. చివరికి మీ సిబ్బంది మరో ఎయిర్‌లైన్ నుంచి వీల్‌చైర్‌ను తీసుకొచ్చి తనను తీసుకెళ్లారని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.అయితే నటి ఖుష్బూకి కలిగిన బాధకు ఎయిర్ ఇండియా క్షమాపణలు చెప్పింది. మీ అనుభవాలకు మేము క్షమాపణలు కోరుతున్నాము. ఈ విషయాన్ని వెంటనే చెన్నై ఎయిర్‌పోర్ట్ కమిటీకి తీసుకెళ్తామని ట్విట్టర్‌లో స్పందించారు.

Also Read: Director Atlee: తండ్రైన స్టార్‌ డైరెక్టర్.. శుభాకాంక్షలు తెలిపిన కీర్తి సురేష్, సమంత..!

దక్షిణ భారత చలనచిత్రాలలో ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ నవంబర్ 2014లో కాంగ్రెస్‌లో చేరారు. దీనికి ముందు ఆమె 2010 నుండి జూన్ 2014 వరకు డీఎంకేలో ఉన్నారు. 2010లో డీఎంకే అధినేత కరుణానిదే స్వయంగా ఆమెని పార్టీలోకి తీసుకొచ్చారు. నాలుగేళ్ల తర్వాత ఖుష్బూ సుందర్ డీఎంకేను వీడి కాంగ్రెస్‌లో చేరారు. 2014లో సోనియా గాంధీని కలిసిన తర్వాత ఆమె కాంగ్రెస్‌లో చేరారు. అయితే, కాంగ్రెస్‌లో ఉండగా ఆమెకు 2019 లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్‌ లభించలేదు. రాజ్యసభకు కూడా ఎన్నిక కాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.