Vijays Last Film: ప్రముఖ నటుడు విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేయనుంది. ఈనేపథ్యంలో విజయ్ చివరి సినిమాపై కీలక అప్‌డేట్ బయటికి వచ్చింది. ఆయన లాస్ట్ మూవీ పేరు ‘జన నాయగన్’. ఈ సినిమా విడుదల తేదీపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీ 2026 సంవత్సరం జనవరి 9న రిలీజ్ కానుంది. దీనికి డైరెక్టరుగా హెచ్. వినోద్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్నారు.
Also Read :MPs Salary Hike : ఎంపీలకు గుడ్ న్యూస్.. శాలరీలు, పింఛన్లు పెంపు
కీలక పాత్రల్లో వీరు..
ఇదొక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో మమితా బైజు, బాబీ దేవోల్, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ నటిస్తున్న లాస్ట్ మూవీ కావడంతో.. ‘జన నాయగన్’ కోసం ప్రత్యేక గీతాన్ని రూపొందించారట. ఈ సాంగ్‌లో దర్శకులు లోకేశ్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్‌లతోపాటు ఓ హీరో అతిథి పాత్రల్లో సందడి చేస్తారట. విజయ్(Vijays Last Film) 69వ సినిమాగా ‘జన నాయగన్’ సందడి చేయబోతోంది.
Also Read :Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. శ్రవణ్‌కు సుప్రీంకోర్టులో ఊరట
పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
‘‘తమిళనాడు రాజకీయాల్లో విజయ్ దూకుడు పెంచారు. మీరు ఆయన పార్టీని గమనిస్తున్నారా? ’’ అని తాజాగా పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తాను ప్రత్యేకంగా దానిపై ఎప్పుడూ దృష్టిసారించలేదన్నారు. విజయ్ పార్టీ గురించి వాళ్లు, వీళ్లు మాట్లాడుకుంటుంటే విన్నానని తెలిపారు. ‘‘విజయ్ అంటే నాకు చాలా గౌరవం. ఒకే ఒక్కసారి కలిశాం. రాజకీయాల్లో ప్రయాణం చాలా కఠినంగా ఉంటుంది. ఓపిక, సహనం ఉండాలి. ఆయనకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా’’ అని పవన్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ తమిళ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో క్లిప్‌ను విజయ్ అభిమానులు, జనసేన నేతలు నెట్టింట షేర్ చేస్తున్నారు.