IAS Officers : హిందూ ఐఏఎస్ ఆఫీసర్స్’ పేరుతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటైన అంశాన్ని కేరళ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇద్దరు ఐఏఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశారనే అభియోగంతో ఐఏఎస్ అధికారి గోపాల కృష్ణన్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని సోషల్ మీడియా వేదికగా విమర్శించినందుకు ప్రశాంత్ అనే మరో ఐఏఎస్ ఆఫీసరును కూడా సస్పెండ్ చేసింది. ఈవిధమైన చర్యల ద్వారా గోపాల కృష్ణన్, ప్రశాంత్‌లు సివిల్ సర్వీసు అధికారుల క్రమశిక్షణా కోడ్‌ను ఉల్లంఘించారని కేరళ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ నుంచి అందిన అధికారిక నివేదిక ఆధారంగా ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారుల సస్పెన్షన్‌కు సీఎం పినరయి విజయన్(IAS Officers) ఆదేశాలు జారీ చేశారని వెల్లడించాయి. ప్రస్తుతం కేరళ పరిశ్రమలు-వాణిజ్య శాఖ డైరెక్టర్‌గా ఐఏఎస్ గోపాల కృష్ణన్ వ్యవహరిస్తున్నారు. కేరళ వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఐఏఎస్ ప్రశాంత్ వ్యవహరిస్తున్నారు.
Also Read :Krish got married to Priti Challa : రెండో పెళ్లి చేసుకున్న స్టార్ డైరెక్టర్
ఐఏఎస్ ప్రశాంత్ ఇటీవలే ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్ట్ చేశారు. ‘‘సీనియర్ ఐఏఎస్ అధికారి, అడిషనల్ చీఫ్ సెక్రెటరీ ఎ.జయతిలక్ నాకు వ్యతిరేకంగా మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన చేస్తున్న ప్రచారానికి ఎలాంటి ఆధారాలూ లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఎ.జయతిలక్ మీడియాకు స్పెషల్ రిపోర్టర్‌లా మారారు. నన్ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. వాస్తవానికి నేను ఇలాంటి విషయాలు పబ్లిక్‌లో చెప్పను. ప్రస్తుతం మరో మార్గం లేక ఇలా చెప్పుకోవాల్సి వచ్చింది. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది కాబట్టి ఈవిషయాన్ని నేను ప్రజలకు వెల్లడిస్తున్నాను’’ అని ఆ పోస్టులో ఐఏఎస్ ప్రశాంత్ ఆరోపణలు చేశారు.
Also Read :Samantha : నాకు తల్లి కావాలని ఉంది.. దానికి వయసుతో సంబంధం లేదు.. సమంత కామెంట్స్..
అయితే ఐఏఎస్ ప్రశాంత్ గతంలో ‘ఉన్నతి’ అనే ఒక ప్రభుత్వ స్కీంను అమలు చేసే విభాగానికి సీఈఓగా వ్యవహరించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన పలు కార్యక్రమాలను అమలు చేయడం ‘ఉన్నతి’ స్కీం లక్ష్యం. అయితే ‘ఉన్నతి’ స్కీం సీఈవోగా ఐఏఎస్ ప్రశాంత్ ఉన్న టైంలో కొన్ని కీలకమైన ఫైళ్లు మాయం మయ్యాయని మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై సీఎం విజయన్‌కు సీనియర్ ఐఏఎస్ అధికారి, అడిషనల్ చీఫ్ సెక్రెటరీ ఎ.జయతిలక్ నివేదిక అందజేశారని ఆ కథనాల్లో ప్రస్తావించారు. ఈ కారణం వల్లే ఎ.జయతిలక్‌పై ఫేస్‌బుక్‌లో ఐఏఎస్ ప్రశాంత్ పోస్టులు పెట్టారు.