Site icon HashtagU Telugu

National Flag: వీడియో వైర‌ల్‌.. జాతీయ జెండా ముడి విప్పిన ప‌క్షి..!

National Flag

National Flag

National Flag: ఆగ‌స్టు 15, 1947వ సంవ‌త్స‌రంలో భార‌తదేశానికి బ్రిటీష్ వారి పాల‌న నుండి విముక్తి వ‌చ్చింది. దీంతో ఆ రోజును ప్ర‌తి సంవ‌త్స‌రం మ‌నం స్వాతంత్య్ర దినోత్స‌వంగా (National Flag) జ‌రుపుకుంటాం. ఈరోజున దేశ‌మంతా పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ఎంద‌రో స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యోధుల పోరాట ఫ‌లితంగా మ‌న దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

అయితే ఈ 78వ స్వాతంత్య్ర దినోత్స‌వం రోజున ప్ర‌ధాని మోదీ ఎర్ర‌కోట‌పై జెండావిష్క‌ర‌ణ చేశారు. ఆ త‌ర్వాత దేశమంతటా స్వాతంత్య్ర వేడుక‌లు జ‌రిగాయి. ఈ క్ర‌మంలోనే కేర‌ళ‌లో ఓ వింత ఘ‌ట‌న చోటుచేసుకుంది. వీడియోని బ‌ట్టి చూస్తే కేర‌ళ‌లోని ఓ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. స్వాతంత్య్ర వేడుక‌ల సంద‌ర్భంగా కేర‌ళ‌లోని ఓ ప్రాంతంలో ఉపాధ్యాయులు స్వాతంత్య్ర వేడుక‌లకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే ఓ వ్య‌క్తి జెండావిష్క‌ర‌ణ కోసం తాడును పైకి లాగాడు. అయితే పై భాగానికి వెళ్లిన జెండా చిక్కుముడి ప‌ట్టి జెండా ఎగ‌ర‌లేదు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే ఇది గ‌మ‌నించిన ఓ ప‌క్షి వ‌చ్చి జెండాకు పడిన ముడిని విప్పింది. ఆ వెంట‌నే వ‌చ్చిన దారిలోనే ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఆ ప‌క్షి చిక్కుముడి విప్పిన త‌ర్వాత జెండావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం సజావుగా సాగింది. అయితే ఈ ఘ‌ట‌న‌ను స్థానికులు త‌మ ఫోన్ల‌లో రికార్డు చేశారు. ఇలా జ‌ర‌గ‌టంతో అక్క‌డ ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు సైతం ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు సైతం త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే కేర‌ళ‌లో ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో క్లారిటీగా తెలియ‌దు. అయితే ఈ వీడియో నిజం కాద‌ని కొంద‌రు మ‌రో వీడియోను షేర్ చేస్తున్నారు. ఆ ప‌క్షి చెట్టు మీద వాలింద‌ని, జాతీయ జెండా ముడి విప్ప‌లేద‌ని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు పెడుతూ వీడియోలు సైతం పెడుతున్నారు.

Also Read: Investment: నెల‌కు రూ. 1000 పెట్టుబ‌డి.. రూ. 3 ల‌క్ష‌ల‌కు పైగా రాబ‌డి, స్కీమ్ ఇదే..!