Kerala Model: కేరళ మోడల్ సూసైడ్ కేసులో ట్విస్ట్!

కోజికోడ్‌కు చెందిన యువ మోడల్, నటి సహానా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - May 14, 2022 / 04:47 PM IST

కోజికోడ్‌కు చెందిన యువ మోడల్, నటి సహానా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె మృతి కేసుకు సంబంధించిన ఆధారాలను కేరళ పోలీసులు సేకరించారు. విచారణ పలు షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ఈ మేరకు సహానా భర్త సజ్జాద్‌ను పోలీసులు ఇన్విస్టిగేషన్ చేశారు. ఆమె 21వ పుట్టినరోజున చనిపోవడానికి గల కారణాలను లోతుగా అడిగి తెలుసుకున్నారు. సర్‌గోడ్‌లోని చెరువత్తూరుకు చెందిన సహానా పలు జ్యువెలరీ యాడ్స్‌లో నటించి ఏడాదిన్నర క్రితం సజ్జాద్‌ను పెళ్లాడింది. గతంలో ఖతార్‌లో ఉద్యోగం చేస్తున్న సజ్జాద్, కొన్ని వారాల క్రితం కోజికోడ్ నగరంలోని పరంబిల్ బజార్‌లో అద్దె ఇంట్లో సహనాతో కలిసి జీవించడం ప్రారంభించాడు. సజాద్ పుట్టినరోజున ఆలస్యంగా భర్త రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) కె సుదర్శన్ మీడియాకు తెలిపారు. కానీ ఆమె బాత్రూమ్ లోపల చనిపోయినట్లు భర్త తెలిపాడు.

కానీ బాత్ రూంలో ఒక ప్లాస్టిక్ తాడును పోలీసులు కనుగొన్నారు. సహానా ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా చంపారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సహానా తన పుట్టినరోజున చనిపోయిందనీ,  భర్త హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై సహనా సోదరుడు బిలాల్ రియాక్ట్ అవుతూ.. సజ్జాద్ తల్లిపై కూడా విచారణ జరిపించాలని అన్నారు. “పోస్ట్‌మార్టం నివేదికలో ఆత్మహత్య అని చెప్పబడినప్పటికీ, హత్య అని ఆరోపించారు. ఆమె శరీరంపై గాయాలు, మచ్చలు ఉన్నాయి. కాబట్టి ఆమె మరణంపై మాకు అనుమానాలు ఉన్నాయని, ఇందులో అతని తల్లి పాత్ర ఉందని అన్నారు. డబ్బులు, ఆస్తి కోసమే హత్య చేశారని నటి బంధువులు అంటున్నారు. ఇంకొన్ని రోజులు గడిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి.