Site icon HashtagU Telugu

Kerala : ఓ వ్యక్తి బాధలకు చలించిపోయిన కేరళ విద్యాశాఖ మంత్రి…ఏం చేశారో తెలుస్తే షాక్ అవుతారు..!!

r bindhu

r bindhu

సాధారణంగా రాజకీయ నేతలకు సామాన్యుల కష్టాలు పట్టవు. సామాన్యుల కష్టాలు ఉంటే చూసి చలించేవారు చాలా అరుదు. కానీ కేరళ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఆర్. బిందు పూర్తిగా భిన్నంగా వ్యవహరించారు. ఆమె త్రిసూర్ లోని ఇరింజళకుడ వద్ద జరిగిన ఓ మెడికల్ ఎయిడ్ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో వివేక్ ప్రభాకర్ అనే కిడ్నీ బాధితుడు కూడా పాల్గొన్నాడు. వివేక్ ప్రభాకర్ దాతల కోసం చూస్తున్నాడు.

అతడి దీనగాథను స్వయంగా విన్న మంత్రి ఆర్. బిందు చలించిపోయింది. అతడి కష్టాన్ని విని కరిగిపోయారు. వెంటనే తన చేతులకున్న గాజుల్లో ఒకదానిని తీసి వివేక్ ప్రభాకర్ కు ఇచ్చారు. దాంతో అక్కడున్న వారంతా మంత్రి ఔదార్యానికి ముగ్దులయ్యారు. ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు.

Exit mobile version