Site icon HashtagU Telugu

kerala Lottery : తిరుఓనం లక్కీ డ్రా .. మొదటి బహుమతి ఏకంగా రూ.25 కోట్లు..

Kerala Lottery Department Onam Bumper lottery 25 crores announced

Kerala Lottery Department Onam Bumper lottery 25 crores announced

లాటరీ టికెట్లు(Lottery Tickets) కొంటే లక్కు కలిసొస్తుందా ? అంటే కొందరికి కలిసొస్తుందనే చెప్పాలి. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరిని ఎలా కటాక్షిస్తుందో చెప్పలేం. చాలామంది తమ అదృష్టాన్నే నమ్ముకుంటూ ఉంటారు. గతంలో ఏళ్ల తరబడి లాటరీ టికెట్లు కొనుగోలు చేసేవారికి ఒక్కసారిగా కోట్లు వచ్చిన సంఘటనల గురించి వినే ఉంటారు.

ముఖ్యంగా కేరళలో(Kerala) కొన్ని పండుగల సందర్భంగా అధికారికంగా విక్రయించే లాటరీ టికెట్లలో అదృష్టవంతులు ఎక్కువగా ఉంటారు. ఈసారి కేరళ లాటరీ డిపార్ట్మెంట్(Kerala Lottery Department) తిరుఓనం(Onam) సందర్బంగా లాటరీ టికెట్లను అమ్మగా.. వాటిలో ఒక టికెట్ ను కొనుగోలు చేసిన వ్యక్తికి మొదటి బహుమతి కింద ఏకంగా రూ.25కోట్లు వచ్చాయి.

కేరళలో ఓనం, విషు, క్రిస్మస్.. ఇలా ప్రత్యేక పర్వదినాల సమయంలో కేరళ లాటరీ డిపార్ట్మెంట్ బంపర్ లాటరీ టికెట్లను జారీ చేస్తుంది. ఇటీవల ఓనంను పురస్కరించుకుని తిరుఓనం బంపర్ బీఆర్-93 పేరిట లాటరీ టికెట్లను అమ్మింది. తిరువనంతపురం గోర్కీ భవన్ లో జరిగిన లక్కీ డ్రా లో విజేతలను రాష్ట్ర ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ ప్రకటించారు. మొదటి విజేతకు రూ.25 కోట్లు, రెండో విజేతగా 20 మందికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు, మూడో విజేతగా 20 మంది రూ.50 లక్షలు చొప్పున, నాలుగో విజేతగా 10 మంది రూ.5 లక్షల చొప్పున వచ్చాయి. త్వరలోనే వీరంతా లాటరీ లక్కీ డ్రా లో గెలుచుకున్న నగదును అందుకోనున్నారు. తొలి విజేతగా రూ.25 కోట్లు గెలుచుకున్న వ్యక్తి కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నంబర్ టీఈ 230662 అని కేరళ రాష్ట్ర లాటరీ విభాగం తెలిపింది.

 

Also Read : Hyderabad: గణేష్ చేతిలోని 11 కిలోల లడ్డూ చోరీ