Site icon HashtagU Telugu

Kerala Fisherman Lottery: బ్యాంక్ లోను చెల్లించాలని నోటీస్.. ఆరోజే 70 లక్షల లాటరీ!

Kerala Man Lottery

Kerala Man Lottery

అద్రుష్టం అంటే అతనిదే. బ్యాంకు అప్పు తీర్చాలని నోటీస్ అందించిన రోజే 70 లక్షల లాటరీ దక్కింది. ప్రస్తుతం ఈ వార్త కేరళలో చక్కర్లు కొడుతోంది. కేరళలోని కొల్లం జిల్లాలో పూకుంజు అనే మత్స్యకారుడికి రాష్ట్ర ప్రభుత్వం అక్షయ లాటరీలో రూ.70 లక్షలు వచ్చింది. అక్టోబరు 12న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో లాటరీ టిక్కెట్‌ను కొన్నాడు. అయితే లక్కీగా రూ. 70 లక్షలు లాటరీ తగిలింది. తాను లక్షాధికారిని అవుతానని కలలో కూడా ఊహించి ఉండడు. ఇల్లు కట్టుకోవడానికి తీసుకున్న రూ.9 లక్షల రుణం చెల్లించలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో నోల్ డబ్బులు తిరిగి చెల్లించకలేకపోవడంతో కరుణాగపల్లి యూనియన్ బ్యాంక్ నోటీసు పంపింది.

ఇద్దరు పిల్లలతో సహా కుటుంబాన్ని భారంగా నెట్టుకొస్తున్న మత్స్యకారుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు, దీంతో అతను ఇంటిని అమ్మే నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. అయితే, అతనిపై విధి దయ చూపుతూ బ్యాంక్ నోటీసు అందిన కొన్ని గంటల్లోనే, లాటరీ టికెట్ విజేతను ప్రకటించింది. అటాచ్‌మెంట్ నోటీసు పంపిన రూ. 70 లక్షల డబ్బును తీసుకునేందుకు అదే బ్యాంక్ కు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.