Kerala CM : నేడు ప్ర‌ధాని మోదీతో కేర‌ళ సీఎం భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీని ఆయ‌న తొలిసారి క‌ల‌వ‌నుండ‌టంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. అధికారికంగా సమావేశ అజెండా వెల్లడించకపోయినప్పటికీ, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర సహాయం, అలాగే రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశముందని సమాచారం. […]

Published By: HashtagU Telugu Desk
V.D. Satheesan Sworn In as Kerala CM

V.D. Satheesan Sworn In as Kerala CM

కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీని ఆయ‌న తొలిసారి క‌ల‌వ‌నుండ‌టంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. అధికారికంగా సమావేశ అజెండా వెల్లడించకపోయినప్పటికీ, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర సహాయం, అలాగే రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశముందని సమాచారం. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ ను కూడా సీఎం సతీశన్ కలవనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా సతీశన్ కాంగ్రెస్ అగ్రనేతలైన మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో సమావేశమై రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ భవిష్యత్ వ్యూహాలు, పాలనాపరమైన అంశాలు కూడా ఈ సమావేశాల్లో చర్చించే అవ‌కావం ఉన్న‌ట్లు సమాచారం.

  Last Updated: 26 May 2026, 08:48 AM IST