వివాహాల్లో (Wedding) కేరళ సంప్రదాయం డిఫరెంట్ గా ఉంటుంది. ఎంగేజ్ మెంట్ నుంచి పెళ్లి వరకు ప్రతిదీ భినంగా ఉంటుంది. ఈ ఫొటోలో కనిపించే కేరళ అమ్మాయి (Kerala bride) తన పెళ్లిని డిఫరెంట్ సెలబ్రేట్ చేసుకుంది. ఎరుపు రంగు పట్టు చీర, ఆభరణాలు ధరించిన ఈ పెళ్లికూతురు పెర్కషన్ కళాకారుల సమూహంతో డోలు (చండా) వాయించి అందర్నీ ఆకట్టుకుంది. ఆమె (Kerala bride) కళ ప్రతిఒక్కరినీ ఫిదా చేస్తోంది. త్రిస్సూర్ జిల్లా గురువాయూర్‌లో దేవానంద్ చెలోట్‌తో ఈ వివాహం జరిగింది.
పెళ్లి తంతు ముగియగానే పెళ్లి కూతురు (Kerala bride) శిల్పా శ్రీకుమార్ అద్భుతమైన ప్రదర్శన చేసి వావ్ అనింపించింది. పెళ్లికూతురు ఆనందం చూసి తండ్రి కూడా ఆమేతో చేరి డోలు వాయించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “నేను 12 సంవత్సరాలుగా చెండ (Chendra) నేర్చుకున్నా. వివాహ సమయంలో నా కళను ప్రదర్శించాలనుకున్నా. బంధువులు, స్నేహితులు బాగా ఎంకరేజ్ చేశారు. నా భర్త దేవానంద్ కూడా నాతో కలిసి డోలు వాయించాడు” అని శిల్పా చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
https://twitter.com/LHBCoach/status/1607408001488683008?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1607408001488683008%7Ctwgr%5Eddeb36cbed6a284f5fa57a07b02f8a0c8ad648f8%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.thenewsminute.com%2Farticle%2Fwatch-kerala-bride-stuns-her-chenda-performance-during-wedding-171331
Also Read : Dhamaka Box Office Collections: రవితేజ జోరు.. ‘ధమాకా’కు అదిరిపొయే కలెక్షన్స్!