Site icon HashtagU Telugu

Kerala Court : బిజెపి నేత హత్య కేసు..సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు

Kerala Bjp Leader Murder Ca

Kerala Bjp Leader Murder Ca

కేరళలో రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన బిజెపి నేత హత్య (Kerala Bjp Leader Murder) కేసులో దోషులుగా తేలిన 15 మందికి కేరళలో సెషన్స్ కోర్టు మరణ శిక్ష విధించింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు చెందిన వ్యక్తులకు ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది. అలప్పుళలోని మావేళిక్కర అడిషనల్ డిస్ట్రిక్ జడ్జి వీజీ శ్రీదేవీ ఈ మేరకు తీర్పు చదివారు.

We’re now on WhatsApp. Click to Join.

2021 డిసెంబరు 19న అలప్పుళలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ దారుణ హత్యకు గురయ్యారు. పీఎఫ్ఐ, ఎస్​డీపీఐ కార్యకర్తలు రంజిత్ ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యుల ఎదుటే అత్యంత పాశవికంగా హత్య చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 15 మందిని దోషులుగా తేల్చింది. దోషులకు గరిష్ఠ శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వాదించింది. దోషులంతా హత్యలు చేయడానికి శిక్షణ పొందిన బృందం సభ్యులు అని తెలిపింది. తల్లి, భార్య, పిల్లల ఎదుటే రంజిత్​ను దారుణంగా చంపేశారని, అత్యంత అరుదైన నేరంగా పరిగణించి శిక్ష విధించాలని కోరింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం వారికి మరణ శిక్ష విధించింది.

కాగా, 2021 డిసెంబర్ 18న ఎస్​డీపీఐ నాయకుడు కేఎస్ షాన్ హత్యకు గురయ్యాడు. ఇంటికి తిరిగి వస్తుండగా షాన్​ను ఓ ముఠా చంపేసింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే రంజిత్ హత్యకు గురవ్వడం అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది.

 

Read Also : Virat Kohli: విరాట్ కోహ్లీ మొద‌టి రెండు టెస్టుల‌కు దూరం కావ‌టానికి కార‌ణ‌మిదేనా..?