Site icon HashtagU Telugu

Ayyappa Swamy Prasadam: కేరళ అయ్యప్ప స్వామి ప్రసాదం నిలిపివేత!

Ayyappa prasadam

Ayyappa

కేరళ (Kerala) అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని(Prasadam) తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రావెన్కోర్ దేవస్థానం ఆధ్వర్యంలో తయారవుతున్న అరవణం ప్రసాదంలో వాడుతున్న యాలకుల్లో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. ప్రసాదంలో వాడిన యాలకుల్లో 14 రకాల హానికారక (Harmful) అవశేషాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రసాదం  నిలిపివేసినట్టు, ఇప్పటికే పంపిణీకి సిద్ధంగా ఉన్న ఆరు లక్షల డబ్బాలను పూర్తిగా నిలిపినట్టు తెలుస్తోంది.

అయితే రేపటి నుంచి యాలకులు లేని అరవనం ప్రసాదాన్ని(Prasadam) పంపిణీ చేయాలని కేరళ కోర్టు ఆదేశించింది. కాగా రానున్న నాలుగైదు రోజుల్లో మకరజ్యోతి కి వచ్చే లక్షలాది మంది భక్తులకు ప్రసాదం కొరత ఏర్పడే అవకాశం ఉంది. యుద్ధ ప్రాతిపదికన రేపటి నుంచి యాలకులు లేని ప్రసాదాన్ని (Prasadam) తయారుచేసి పంపిణీ చేసేందుకు సిద్ధమైన ట్రావెల్ కోర్ దేవస్థానం సిద్ధమవుతోంది.

Also Read: Veera Simha Reddy Review: బాలయ్య ‘వీరసింహారెడ్డి’ ఫస్ట్ రివ్యూ!