Site icon HashtagU Telugu

Kedarnath Dham: కేదర్‌నాథ్‌లో ప్రారంభమైన పూజలు.. తెరుచుకున్న ఆలయం!

Kedarnath Dham

Kedarnath Dham

Kedarnath Dham: ఉత్తరాఖండ్‌లోని బాబా కేదార్‌నాథ్ ధామ్ (Kedarnath Dham) ద్వారాలు తాజాగా తెరిచారు. ఉదయం 7 గంటలకు ద్వారాలు పూర్తి విధి విధానాలతో ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంలో భారత సైన్యం గఢ్‌వాల్ రైఫిల్స్ బ్యాండ్ భక్తి రాగాలను వాయించింది. అలాగే భక్తులపై హెలికాప్టర్ నుండి పూల వర్షం (పుష్ప వర్షం) కూడా కురిపించారు. కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలు తెరిచిన తర్వాత అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జ‌రిగాయి. ఇందులో పుష్కర్ సింగ్ ధామి కూడా పాల్గొన్నారు. బాబా కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలు తెరవడానికి ముందే దేశ-విదేశాల నుండి భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకోవడం ప్రారంభించారు.

కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలు తెరిచారు

భక్తుల ఎదురుచూపు ముగిసింది. ఎందుకంటే ఉత్తరాఖండ్‌లోని బాబా కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలు తెరవబడ్డాయి. ఈ రోజు ఉదయం ద్వారాలు తెరిచారు. అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా హాజరయ్యారు. ద్వారాలు తెరిచిన తర్వాత భక్తులను పూల వర్షంతో స్వాగతించారు. ద్వారాలు తెరిచిన తర్వాత అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు మొద‌ల‌య్యాయి. ఇందులో భక్తులు సంతోషంతో నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. దీనికి సంబంధించిన అనేక వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భక్తుల సంతోషాన్ని చూడవచ్చు. ద్వారాలు తెరవడానికి ముందు రాష్ట్రంలో వర్షం కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.

Also Read: India- Pakistan: ఓ ర‌హ‌స్య నివేదిక‌.. భార‌త్‌- పాక్ మ‌ధ్య యుద్ధం త‌ప్ప‌దా!

బద్రీనాథ్ విశాల్ ద్వారాలు ఎప్పుడు తెరుస్తారు?

ద్వారాలు తెరిచిన తర్వాత ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన భ‌క్తుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. “చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30న అక్షయ తృతీయ సందర్భంగా ప్రారంభమైంది. ఈ రోజు నుండి రెండు రోజుల తర్వాత భగవాన్ బద్రీనాథ్ విశాల్ ద్వారాలు కూడా తెరవబడతాయి. ఈ యాత్ర పూర్తి ఉత్సాహంతో ప్రారంభమవుతుంది” అని ముఖ్యమంత్రి తెలిపారు. ఇంకా మాట్లాడుతూ.. “భక్తుల యాత్ర సురక్షితంగా ఉండేలా, వారు యాత్ర సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేలా మేము పూర్తి ఏర్పాట్లు చేశాము” అని అన్నారు.