Hijab Issue : రాష్ట్రాలకు పాకుతున్న హిజాబ్ వివాదం, పుదుచ్చేరిలో సేమ్ సీన్ రిపీట్

కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోన్న సమయంలోనే దీని సెగ మద్యప్రదేశ్, పుదుచ్చేరికి తాకింది.

కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోన్న సమయంలోనే దీని సెగ మద్యప్రదేశ్, పుదుచ్చేరికి తాకింది.కర్నాటకలో ఒక విద్యార్థిని హిజాబ్ దరించి విద్యాసంస్థకు రావడంపై అక్కడి హిందుత్వ విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దాంతో ఇరు వర్గాల విద్యార్థులకు మాటల యుద్దం సాగింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాధాలు ఇచ్చుకున్నారు. ముస్లిం విద్యార్థినిలు హిజాబ్ దరిస్తే తాము కాషాయ కండువాలను దరిస్తామని తెలిపారు. ఆ వివాదం ముదరడంతో ప్రభుత్వం అక్కడి విద్యాసంస్థలకు మూడు రోజులపాటు సెలవులను ప్రకటించారు.

పుదుచ్చేరిలోని ఒక ప్రభుత్వ స్కూల్ విద్యార్థిని హిజాబ్ వేసుకురావడంతో అక్కడి టీచర్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆ స్కూల్ వద్ద ఇరువర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సదరు విద్యార్థిని గత కొన్నేళ్లుగా హిజాబ్ దరించి వస్తోందని ఇన్ని రోజులు లేని అభ్యంతరం ఇప్పుడేంటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు సంఘటనపై పూర్తి నివేధిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

హిజాబ్ పై మద్దతుగా, వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలోనే మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి హిజాబ్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేగుతున్నాయి. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేదించాలని మద్యప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంధర్ సింగ్ కామెంట్ చేశారు. హిజాబ్ విద్యార్థుల యూనిఫారంలో బాగం కాదని, కాబట్టి విద్యాసామతల్లో హిజాబ్ దరించడం నిషేదించాలని ఆయన అన్నారు. సంప్రదాయాలను తమ ఇండ్లలో పాటించాలని కోరిన ఇంధర్ విద్యాసంస్థల్లో డ్రెస్ కోడ్ కచ్చితంగా అమలుచేయాలని తమ ప్రభుత్వం కృషీ చేస్తుందని, దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇంధర్ వ్యాఖ్యలపై మద్యప్రదేశ్ కాంగ్రెస్ నేత అబ్బాస్ హఫీజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో గాడితప్పిన విద్యావ్యవస్థను ఎలా చక్కదిద్దాలో ఆలోచించాల్సిన ప్రభుత్వం, విద్యాసంస్థల్లో మత ఎజెండాను ఎలా అమలుచేయాలని ఆలోచించడం విచారమని అబ్బాస్ విమర్శించారు. ముస్లింలు హిజాబ్, సిక్కులు తలపాగా దరించడం అనాదిగా వస్తోందని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల సాంప్రదాయాలను దూరం చేయాలని ఆలోచించడం మానుకోవాలని ప్రభుత్వానికి అబ్బాస్ సూచించారు.