Site icon HashtagU Telugu

Karnataka School : “గుడిలో బ‌డి” క‌ర్ణాట‌క‌లో నీట‌మునిగిన పాఠ‌శాల‌.. ప్ర‌త్య‌మ్నాయంగా..?

Karnataka Imresizer

Karnataka Imresizer

క‌ర్ణాట‌క‌లోని రామనగర జిల్లాలో భారీ వ‌ర్షాలు అత‌లాకుత‌లం చేశాయి. భారీ వ‌ర్షాలు కురిసి మూడు వారాలైంది. అయితే చన్నపట్న పట్టణంలోని తట్టేకెరె ప్రాంతంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాలుగు అడుగుల మేర నీరు నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలోకి ప్రవేశించలేని పరిస్థితి నెలకొంది. పాఠశాల నుండి నీటిని తొలగించడానికి స్థానిక అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే విద్యార్థులు సమీపంలోని ఆలయం(గుడి) లో తరగతులకు హాజరవుతున్నారు. తట్టేకెరె బెంగళూరు నుండి 60 కి.మీ, రామనగర నుండి 11 కి.మీ దూరంలో ఉంది. పాఠశాలలో ఒకటి నుండి ఎనిమిది తరగతుల వరకు 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు, మధ్యాహ్న భోజనాన్ని సిద్ధం చేయడానికి వంటవారితో సహా ఐదుగురు ఉపాధ్యాయులు మరియు ఇద్దరు సిబ్బంది ఉన్నారు. 30 ఏళ్లు పైబడిన పాఠశాల విశాలంగా, కాంపౌండ్ వాల్స్‌తో కూడుకున్నదని స్థానికులు తెలిపారు.