Raj Bhavan : రాజ్‌భవన్‌కు బాంబు బెదిరింపు కాల్.. బెంగళూరులో కలకలం

Raj Bhavan : కర్ణాటక రాజ్‌భవన్‌కు సోమవారం అర్ధరాత్రి తర్వాత బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Raj Bhavan

Raj Bhavan

Raj Bhavan : కర్ణాటక రాజ్‌భవన్‌కు సోమవారం అర్ధరాత్రి తర్వాత బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి కాల్ చేసి.. రాజ్‌భవన్‌‌లో బాంబు పెట్టామని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు వెంటనే బాంబ్ స్క్వాడ్‌‌ను రాజ్‌భవన్‌కు పంపారు. రాజ్‌భవన్ ఆవరణ అంతా జల్లెడ పట్టినా అనుమానాస్పద వస్తువులు కానీ, పేలుడు పదార్థాలు కానీ దొరకలేదు. ఈ బాంబు బెదిరింపు కాల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. రాజ్‌భవన్ దగ్గర భద్రతను పెంచామని తెలిపారు. అయితే అది బూటకపు ఫోన్ కాలే అయి ఉండొచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి.

We’re now on WhatsApp. Click to Join.

బెంగళూరులోని దాదాపు 44 పాఠశాలల్లో బాంబులు పెట్టామంటూ రెండు వారాల క్రితం ఓ గుర్తు తెలియని కాల్ వచ్చింది. దీంతో అప్పట్లో  విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాలల నిర్వాహకులు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు రంగంలోకి దిగి.. దుండగులు పేర్కొన్న 44 స్కూళ్ల ఆవరణలను ముమ్మరంగా గాలించారు. అయినా ఆయా స్కూళ్లలో అనుమానాస్పద వస్తువులేవీ దొరకలేదు. దీంతో అది ఫేక్ కాల్ అని తేలిపోయింది. ఈసారి రాజ్‌భవన్(Raj Bhavan) విషయంలోనూ అదే తరహా కాల్ వచ్చింది.. అదే తరహా సీన్ రిపీట్ అయింది.

Also Read: Vivek Ramaswamy : వివేక్ రామస్వామికి డెత్ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తికి ఏమైందంటే ?

  Last Updated: 12 Dec 2023, 11:20 AM IST