Amit Malviya: రాహుల్ యానిమేషన్ వీడియో దుమారం.. బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ పై కేసు

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలపై అనుచిత పోస్టులు పెట్టినందుకు గానూ బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాల్వియాపై ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత రమేష్ బాబు

 Amit Malviya: రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలపై అనుచిత పోస్టులు పెట్టినందుకు గానూ బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాల్వియాపై ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత రమేష్ బాబు. ఈ మేరకు కర్ణాటక పొలుసులు బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాల్వియాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీసులు అతనిపై ఐపీసీ 153-ఎ, 120-బి, 505 (2), 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీ యానిమేషన్ వీడియోను విడుదల చేసి, కాంగ్రెస్ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని అమిత్ మాల్వియా అనుచిత పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అమిత్ మాల్వియా జూన్ 17న తన అధికారిక ఖాతా నుంచి యానిమేషన్ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో “కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడల్లా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, రాహుల్‌గాంధీ దేశాన్ని ఛిద్రం చేస్తున్నారని వీడియోలో పేర్కొన్నారు.

కాగా అమిత్ పోస్టుపై కాంగ్రెస్ మండిపడుతుంది. అమిత్ మాల్వియా బెంగళూరుకు వచ్చి కాంగ్రెస్ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఎలా పాల్పడిందో వివరించాలని డిమాండ్ చేశారు. మీరు చేసిన విమర్శలలో నిజం లేకపోతే వెంటనే క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో అలాంటి ఆరోపణలు చేయబోమని లేఖ ఇవ్వాల్సి ఉంటుంది అని అన్నారు.

Read More: Asin Reaction: డివోర్స్ రూమర్స్ పై నటి ఆసిన్ రియాక్షన్ ఇదే!