Site icon HashtagU Telugu

Karnataka: బ‌స్సులో టికెట్ కొనం.. విద్యుత్ బిల్లులు క‌ట్టం.. క‌ర్ణాట‌క‌లో గోల షురూ

Karnataka People fires on Government and not pay current bills women not buy tickets in Buses

Karnataka People fires on Government and not pay current bills women not buy tickets in Buses

క‌ర్ణాట‌క(Karnataka) రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్(Congress) పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. 135 స్థానాల్లో ఆ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించ‌డంతో ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తు లేకుండానే కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవ‌లే సీఎంగా సిద్ధ‌రామ‌య్య‌(CM Siddaramaiah), డిప్యూటీ సీఎంగా శివ‌కుమార్(DK Shivakumar) లు ప్ర‌మాణ స్వీకారం చేశారు. వీరితో పాటు మ‌రో ఎనిమిది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. వీరికి ఇంకా శాఖ‌ల కేటాయింపు జ‌ర‌గ‌లేదు. మ‌రోవైపు శ‌నివారం మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. అంతాబాగానే ఉన్నా.. సిద్ధ‌రామ‌య్య ప్ర‌భుత్వానికి కొత్త త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే ఇప్పుడు సిద్ధ‌రామ‌య్య ప్ర‌భుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల‌కు ప‌లు హామీలు ఇచ్చింది. వాటిల్లో.. కేఎస్ ఆర్టీసీ, బీఎంటీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప్ర‌యాణం. మ‌రోవైపు 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ ఇస్తామ‌ని కాంగ్రెస్ త‌న మేనిఫెస్టోలో పేర్కొంది. వీటితో పాటు మ‌రో ఐదు హామీలపై సిద్ధ‌రామ‌య్య సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే సంత‌కం చేశారు. అయితే, ప్ర‌భుత్వం ఏర్పాటు రోజు నుంచి ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డుతున్నారు. బ‌స్సుల్లో నిత్యం మ‌హిళ‌ల‌కు, కండెక్ట‌ర్లు వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విజ‌య‌న‌గ‌రలో కేఎస్ ఆర్టీసీ బ‌స్సులో కూర్చొన్న మ‌హిళ‌ల‌ను కండ‌క్ట‌ర్ టికెట్ కు డ‌బ్బులు ఇవ్వాలంటూ కోరాడు. దీంతో మ‌హిళ మాకు ఉచితం మేమెందుకు డ‌బ్బులు ఇవ్వాలి అంటూ కండెక్ట‌ర్ పై గొడ‌వ‌కు దిగింది. రాయ‌చూర్ జిల్లాలోనూ ఇలాంటి ఘ‌ట‌న చోటు చేసుకుంది.

మ‌రోవైపు విద్యుత్ బిల్లులు క‌ట్టేది లేదంటూ ప‌లు గ్రామాల్లో ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డుతున్నారు. ప‌ల్లెల‌కు వెళ్లి రీడింగ్ తీసేందుకు విద్యుత్ సిబ్బంది వెనుక‌డుగు వేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. బిల్లులు క‌ట్టాల‌ని లైన్‌మెన్ కోరితే చాలు గ్రామ‌స్తులంద‌రూ మూకుమ్మ‌డిగా ఎదురుతిరుగుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ వ్య‌క్తి ఆరు నెల‌లుగా విద్యుత్‌ బిల్లు క‌ట్ట‌లేదు. బిల్లు క‌ట్టాల‌ని లైన్‌మెన్ గ‌ట్టిగా అడ‌గ‌డంతో స‌ద‌రు వ్య‌క్తి బిల్లు క‌ట్టేది లేదంంటూ దాడికి దిగాడు. కాంగ్రెస్ ఎన్నిక‌ల గ్యారెంటీల‌ను అమ‌లు చేసే విష‌యంలో ప్ర‌స్తుతం సిద్ధ‌రామ‌య్య ప్ర‌భుత్వం త‌ల‌లు ప‌ట్టుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

Exit mobile version