Karnataka: సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి 20 పార్టీలను ఆహ్వానించిన కాంగ్రెస్.. బిఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు అందని ఆహ్వానం..!

కర్ణాటక (Karnataka)లో ఘనవిజయం సాధించిన సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవాన్ని గ్రాండ్‌గా నిర్వహించేందుకు కాంగ్రెస్‌ (Congress) అన్ని సన్నాహాలు చేస్తోంది.

  • Written By:
  • Publish Date - May 19, 2023 / 12:24 PM IST

Karnataka: కర్ణాటక (Karnataka)లో ఘనవిజయం సాధించిన సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవాన్ని గ్రాండ్‌గా నిర్వహించేందుకు కాంగ్రెస్‌ (Congress) అన్ని సన్నాహాలు చేస్తోంది. ప్రమాణస్వీకారోత్సవాన్ని 2024కి కాంగ్రెస్ ట్రైలర్‌గా చూస్తున్నారు. సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ దాదాపు 20 పార్టీలను ఆహ్వానించింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ, బిఎస్‌పి, బిఆర్‌ఎస్, బిజెడి వంటి ప్రతిపక్ష పార్టీలను దూరంగా ఉంచారు. మిత్రపక్షాలే కాకుండా ఎవరితో పొత్తుకు అవకాశం ఉంటుందో ఆ పార్టీలను మాత్రమే ఆహ్వానించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఏ పార్టీలకి ఆహ్వానం అందింది..!

నేషనల్ కాన్ఫరెన్స్ (జమ్మూ మరియు కాశ్మీర్), పీడీపీ (జమ్మూ మరియు కాశ్మీర్), సమాజ్‌వాదీ పార్టీ (ఉత్తరప్రదేశ్), ఆర్ఎల్డీ (ఉత్తర ప్రదేశ్), జేడీయూ (బీహార్), ఆర్జేడీ (బీహార్), సిపిఐ ML (బీహార్), సిపిఎం (బెంగాల్, త్రిపుర), సిపిఐ (బెంగాల్), టిఎంసి (బెంగాల్), JMM (జార్ఖండ్), శివసేన (మహారాష్ట్ర), NCP (మహారాష్ట్ర), డిఎంకె (తమిళనాడు), MDMK (తమిళనాడు), VCK (తమిళనాడు), కేరళ కాంగ్రెస్ (కేరళ), IUML (కేరళ), RSP (కేరళ) పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం పలికింది.

Also Read: KCR: కాంగ్రెస్ పై కేసీఆర్ స్వారీ, ఎన్డీయే ముద్రలో వైసీపీ, టీడీపీ

ఆహ్వానం అందని పార్టీలు ..!

ఆప్ (ఢిల్లీ, పంజాబ్), బీఎస్పీ (ఉత్తర ప్రదేశ్), BJD (ఒడిశా), బిఆర్ఎస్ (తెలంగాణ), AIMIM (తెలంగాణ), వైఎస్ఆర్ కాంగ్రెస్ (ఆంధ్రప్రదేశ్), టీడీపీ (ఆంధ్రప్రదేశ్), AIUDF (అస్సాం), INLD (హర్యానా), JDS (కర్ణాటక) పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం అందలేదు.

కేజ్రీవాల్‌కి దూరం ఎందుకు?

విపక్షాల ఐక్యతకు కసరత్తు చేసినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ కర్ణాటకలోని దాదాపు అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కేజ్రీవాల్, భగవంత్ మాన్ కూడా ప్రచారానికి వచ్చారు. జలంధర్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఆప్ షాక్ ఇవ్వడం కూడా ఒక పెద్ద కారణం. ఢిల్లీ, పంజాబ్‌ల కాంగ్రెస్ నేతలు ఆప్‌తో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. బీఎస్పీతో చాలా కాలంగా ఎలాంటి సంబంధం లేవని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బీఎస్పీ వేరే దారిలో నడుస్తుంది కాబట్టి పొత్తుపై ఆశలు లేవు. యూపీలో అఖిలేష్, జయంత్ చౌదరితో కాంగ్రెస్ సమీకరణ చేస్తోంది.

కేసీఆర్‌ను కూడా ఆహ్వానించలేదు

ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తోంది. అందుకే ప్రస్తుతం బీఆర్‌ఎస్‌తో పొత్తుకు అవకాశం లేదు. బిజేడీ , వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, జేడీఎస్, INLD, AIMIM వంటి ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు అసాధ్యం. అందుకే ఆ పార్టీలకు ఆహ్వానం పంపలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.