Prajwal Revanna : దేవెగౌడ మనవడు ప్ర‌జ్వ‌ల్‌పై జేడీఎస్‌ వేటు.. ఎందుకో తెలుసా ?

Prajwal Revanna : మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణపై జేడీఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.

Published By: HashtagU Telugu Desk
Prajwal Revanna

Prajwal Revanna

Prajwal Revanna : మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణపై జేడీఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్లీల వీడియోల వ్య‌వ‌హారంలో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈవిషయాన్ని జేడీఎస్ పార్టీ మంగ‌ళ‌వారం అధికారికంగా ప్రకటించింది. మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నందున  ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna), ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణలను జేడీఎస్ నుంచి సస్పెండ్‌ చేశారు. జేడీఎస్ నేతల కోరిక మేరే పార్టీ అధిష్టానం  ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం కర్ణాటకలోని హుబ్బళ్లిలో జరిగిన జేడీఎస్ కోర్ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join

అసలు ప్రజ్వల్ ఏం చేశాడు ?

  • మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ కుమారుడే హెచ్‌డీ రేవణ్ణ. ఈయన మాజీ కర్ణాటక రాష్ట్ర మంత్రి. హెచ్‌డీ రేవణ్ణ కొడుకే ప్రజ్వల్ రేవణ్ణ.
  • హెచ్‌డీ రేవణ్ణ నివాసంలో ఆరుగురు మహిళలు పని చేస్తున్నారు.
  • ఈ ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తండ్రీ  కొడుకులు హెచ్‌డీ రేవణ్ణ, ప్రజ్వల్ రేవణ్ణల అసలు స్వరూపం బయటపడింది.
  • రేవణ్ణతో పాటు ఆయన కొడుకు ప్రజ్వల్‌ తనపై, తన కూతురిపై పలుమార్లు లైంగికదాడి చేశారని ఆ మహిళ ఆరోపించింది.
  • రేవణ్ణ ఇంట్లో పనిలో చేరిన నాలుగు నెలల నుంచే తనపై దౌర్జన్యానికి పాల్పడేవారని సదరు మహిళ తెలిపింది.
  • రేవణ్ణ భార్య భవానీ ఇంట్లో లేని టైంలో తనపై లైంగిక దౌర్జన్యానికి దిగేవారని ఆ మహిళ ఆరోపించింది.
  • పండ్లు ఇచ్చే నెపంతో తనను స్టోర్ రూమ్‌కు పిలిచి ప్రజ్వల్ వేధించేవాడని.. వంట గదిలో ఉన్నప్పుడు కూడా ప్రజ్వల్‌ వేధించేవాడని బాధిత మహిళ పేర్కొంది.
  • నలుగు స్నానం చేయించాలని, ఒంటికి తైలాన్ని పెట్టి స్నానం చేయించాలని స్నానాలగదికి తీసుకెళ్లి తనపై లైంగిక దౌర్జన్యం చేసేవారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది .
  • ప్రజ్వల్ తన కూతురికి వీడియో కాల్‌ చేసి అసభ్యంగా ప్రవర్తించేవాడని బాధిత మహిళ చెప్పింది. అతడి చేష్టలను చూడలేక.. తన కూతురు ప్రజ్వల్‌ ఫోన్‌ నంబరును బ్లాక్‌ చేసిందని తెలిపింది.
  • ఈ వేధింపులన్నీ తాళలేక చివరకు తాను రేవణ్ణ ఇంట్లో పనిమానేసి బయటకు వచ్చానని బాధిత మహిళ పోలీసులకు చెప్పారు.
  • ఇక ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు వైరల్ అయ్యాయి.
  • ఈ వీడియోలు బయటికి రాగానే ప్రజ్వల్ జర్మనీకి పారిపోయాడు.

Also Read :Train Derailed: దేశంలో మ‌రో రైలు ప్ర‌మాదం.. ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్

  Last Updated: 30 Apr 2024, 02:04 PM IST