Site icon HashtagU Telugu

Peacocks: నెమళ్లను పెంచుతున్నాడని జైల్లో పెట్టారు….ఎందుకో తెలుసా..?

Download (5) (1)

Download (5) (1)

నెమళ్లను పెంచడం చట్టవిరుద్ధమని…ఆ కారణంతో నెమళ్లను పెంచుతున్న ఓ వ్యక్తిని కర్నాటక అటవీశాఖ పోలీసులు అరెస్టు చేశారు. కామేగౌడనహల్లి గ్రామంలోని తన నివాసంలో మంజూనాయక్ నెమళ్లను పెంచుతున్నాడన్న సమాచారంతో అధికారులు అరెస్టు చేశారు. పెద్ద నెమళిని స్వాధీనం చేసుకున్నారు. భారత వన్యప్రాణుల చట్టం 1972 ప్రకారం నెమళ్లు రక్షిత జంతువుల జాబితాలోకి వస్తాయి. వాటిని వేటాడటం, హింసించడం, అనుమతి లేకుండా పెంచుకోవడం ఇవన్నీ నేరంగా పరిగణించబడతాయి. ఈ క్రమంలోనే మంజూనాయక్ పై కేసు పెట్టి అరెస్టు చేశామని కోర్టు రిమాండ్ మేరకు జైలుకు తరలించామని కర్నాటక అటవీశాఖ ప్రకటించింది.

Exit mobile version