Site icon HashtagU Telugu

Karnataka: విషాదం.. కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మామణి మృతి..!!

Mamani

Mamani

బీజేపీ ఎమ్మెల్యే, కర్నాటక శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఆనందర్ మమణి శనివారం అర్ధరాత్రి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అతనికి 56 సంవత్సరాలు. మామణి సవదత్తి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అతను డయాబెటిక్ పేషంట్ కావడంతో లివర్ కు ఇన్ఫెక్షన్ సోకింది.

గత కొన్నిరోజులుగా బెంగుళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల సలహా మేరకు చెన్నైకి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. గతకొన్ని రోజులుగా కోమాలో ఉన్నారు. అనారోగ్య కారణంతో సెప్టెంబర్ లో మామన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. మామణి మృతి పట్ల ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సంతాపం తెలిపారు. బెలగావిలోని సౌందట్టి ఎలమ్మ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మామణి, 1990లో డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. దివంగత చంద్రశేఖర్ మల్లికార్జున మామని కుమారుడు. మామణి 2008లో బీజేపీలో చేరారు. 2020 మార్చిలో శాసనసభ 24వ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు.