Site icon HashtagU Telugu

Hijab Row: ‘హిజాబ్‌ వివాదం’ పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు!

Hijab Row Pronouncement Karnataka

Hijab Row Pronouncement Karnataka

క‌న్న‌డ‌నాట హిజాబ్ వివాదం పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. రాష్ట్రంలో పాఠ‌శాలలు, క‌ళాశాల‌లు, ఇత‌ర విద్యాసంస్థలో హిజాబ్‌ తప్పనిసరి కాదని పేర్కొంటూ న్యాయ‌స్థానంలో దాఖలైన పిటిషన్లన్నీ కొట్టేసింది. హిజాబ్ ధరించడం ఇస్లాం మతానికి అవసరమైన ఆచారం కాదని పేర్కొన్న ముగ్గురు న్యాయమూర్త‌లు ధ‌ర్మాస‌నం మంగ‌ళ‌వారం తీర్పు వెలువ‌రించింది. ఈ క్ర‌మంలో విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.

ఇక కర్ణాటకలో హిజాబ్ ర‌గ‌డ దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ హిజాబ్ వివాదం పై క‌ర్నాట‌క హైకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వ‌నుంది. ఈక్ర‌మంలో హిజాబ్ అభ్యంత‌రాల‌ను వ్య‌తిరేకిస్తూ కోర్టులో దాఖ‌లైన పిటిట‌న్ పై ప‌ద‌కొండు రోజుల‌పాటు సుదీర్గ వాద‌ల‌ను విన్న హైకోర్టు, ఈరోజు తీర్పు వెలువ‌రించింది. ఇస్లాంలోనూ హిజాబ్ ధరించాలన్న నిబంధన ఏదీ లేదని పేర్కొన్న హైకోర్టు విద్యాసంస్థల్లో యూనిఫారంలు తప్పనిసరిగా ధరించాలని ధ‌ర్మాస‌నం పేర్కొంది. ఈ నేప‌ధ్యంలో విద్యాసంస్థల ప్రొటోకాల్స్‌ను ఎవరైనా పాటించాల్సిందేనని హైకోర్టు స్పషం చేసింది.

ఇక హిజాబ్‌ను విద్యాసంస్థల్లో అనుమతించాలని కొన్ని పిటీష‌న్లు, హిజాబ్‌ను అనుమతించకూడదని మరికొన్ని పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ క్ర‌మంలో అన్ని పిటీషన్లను ఈరోజు హైకోర్టు కొట్టివేసింది. యూనిఫారాంను విద్యార్థులు వ్యతిరేకించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కర్నాట‌క‌లో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. అవాంఛనీయ ఘటనల జరగకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేప‌ధ్యంలో క‌న్న‌డ‌నాట అక్క‌డి ప్రభుత్వం 144వ సెక్షన్ అమలు చేసింది. ఈ క్ర‌మంలో నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ప్ర‌భుత్వం హెచ్చరించింది.

ముఖ్యంగా హిజాబ్ వివాదం ఎక్కువగా ఉన్న దక్షిణ కర్ణాటకలో విద్యాసంస్థలకు ఈరోజు సెలవును ప్రకటించింది. ఇక క‌ర్నాట‌క‌లోని ఉడిపి ప్ర‌భుత్వ క‌ళాశాల‌లో మొద‌లైన హిజాబ్ వివాదం కర్ణాటకను ఊపేసిన సంగ‌తి తెలిసిందే. క్ర‌మ క్ర‌మంగా అనేక విద్యాసంస్థలలో హిజాబ్ ఇష్యూ తలెత్తడంతో అప్ప‌మ‌త్త‌మైన‌ క‌న్న‌డ‌ ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో డ్రెస్ కోడ్ పాటించాలని ప్ర‌క‌టించిన క‌ర్నాట‌క ప్ర‌భుత్వం, విద్యా సంస్థ‌ల్లో హిజాబ్‌ను అనుమంతించ‌లేదు. అయితే మ‌రోవైపు హిజాబ్ వివాదంపై హైకోర్టును ఆశ్రయించడంతో, ఇరు వ‌ర్గాల ధర్మాసనం ఇరు వర్గాల వాద‌నలు విన్న ధ‌ర్మాస‌నం ఈరోజు తీర్పు కిచ్చింది. దీంతో కర్ణాటక అంతటా 144వ సెక్షన్ విధించారు.